మరో మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్

Update: 2020-06-13 15:39 GMT
Representational Image

పాకిస్థాన్ లో ఇద్దరు మాజీ ప్రధానులు కరోనా భారిన పడ్డారు. జూన్ 9న మాజీ ప్రధాని షాహిద్ ఖాకాన్ అబ్బాసికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు. ఇప్పుడు (జూన్ 13 శనివారం) యూసుఫ్ రాజా గిలానీకి కూడా కరోనా సోకినట్టు అధికారులు వెల్లడించారు. శనివారం ఉదయం ఆయన నమూనాలను తీసుకొని పరీక్షించగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దాంతో గిలానీని ఆసుపత్రికి తరలించారు. ఆయన కుటుంబసభ్యులను కూడా క్వారంటైన్ కు తరలించినట్టు అధికారులు తెలిపారు.

గిలానీతో కలిపి పాకిస్తాన్ లో మాజీ ఇద్దరు ప్రధానమంత్రులు నాలుగు రోజుల వ్యవధిలో కరోనా భారిన పడ్డారు. అయితే నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (నాబ్) కారణంగా తన తండ్రికి వ్యాధి సోకిందని గిలానీ కుమారుడు ఆరోపించారు. ఇందులో ప్రత్యేక విషయం ఏమిటంటే గిలానీ తోపాటు అబ్బాసిల అవినీతి ఆరోపణలపై నాబ్ దర్యాప్తు చేస్తోంది. ఇద్దరినీ చాలాసార్లు ప్రశ్నించారు.


Tags:    

Similar News