Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష పడుతుందా? త్వరలోనే ప్రకటించే ఛాన్స్?

Update: 2025-03-18 01:31 GMT

Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరిన్ని కష్టాలు పెరిగాయి. ఆమెకు మరణశిక్ష లేదా జీవితఖైదు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తాజుల్ ఇస్లాం మాట్లాడుతూ..దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతోందని..మానవత్వానికి వ్యతిరేకంగా ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన కేసు, దర్యాప్తు ప్రక్రియకూడా సంక్లిష్టమైనది. వచ్చే నెలలోపు షేక్ హసీనాపై కనీసం ఒక నివేదిక అయినా చీఫ్ ప్రాసిక్యూటర్‌కు దాఖలు చేస్తుందని మేము ఆశిస్తున్నాము. షేక్ హసీనాపై మానవత్వానికి వ్యతిరేకంగా నేరాల ఆరోపణలు ఉన్నాయి. షేక్ హసీనాపై మేము రెండు కేసులు నమోదు చేసాము అని తెలిపారు.

అందులో ఒక కేసు జూలై మారణహోమానికి సంబంధించినదని, మరొకటి ఆగస్టు మారణహోమానికి సంబంధించినదని ప్రాసిక్యూటర్లు తెలిపారు. జూలై, ఆగస్టు నెలల్లో జరిగిన మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు, బలవంతపు కిడ్నాపులు, చట్టవిరుద్ధ హత్యలు మొదలైనవి ఉన్నాయి. రెండు కేసులలోనూ దర్యాప్తులు కొనసాగుతున్నాయి. ఈ నేరాలన్నింటికీ శిక్షలు చట్టంలో నిర్దేశించాయి. మరణశిక్ష, జీవిత ఖైదు, ఇతర శిక్షలు ఇందులో ఏ శిక్ష అనేది ఇప్పుడు ట్రిబ్యునల్ కోర్టు నిర్ణయిస్తుందని వెల్లడించారు.

కాగా బంగ్లాదేశ్‌లో తమ స్నేహితుడిని హత్య చేసిన కేసులో 20 మంది విద్యార్థులకు మరణశిక్షను ఢాకా హైకోర్టు కూడా సమర్థించింది. ఈ విద్యార్థులు 2019 సంవత్సరంలో తమ తోటి విద్యార్థి అబ్రార్ ఫహాద్‌ను కొట్టి చంపారు. ఆ తర్వాత వారికి మరణశిక్ష విధించింది. మరణించిన విద్యార్థి ఫహద్ అప్పటి షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ రాశాడు. ఈ పోస్ట్ కారణంగా, షేక్ హసీనా అవామీ లీగ్ విద్యార్థి విభాగం కార్యకర్తలు ఫహద్‌ను కొట్టి చంపారు. ఈ కేసులో, దిగువ కోర్టు 2021లో నిందితులైన విద్యార్థులను దోషులుగా నిర్ధారించి, వారికి మరణశిక్ష విధించింది. ఇప్పుడు బంగ్లాదేశ్ హైకోర్టు కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించింది.

Tags:    

Similar News