Indonesia: ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం
Indonesia: 11 మంది మృతి, 50 మంది గాయాలు
Indonesia: ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం
Indonesia: ఇండొనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గ్రాడ్యుయేషన్ ట్రిప్‌కు విద్యార్థులను తీసుకెళ్తున్న స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సుమారు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందికిపైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు గ్రాడ్యుయేషన్ ట్రిప్‌కు జావా ద్వీప పట్టణం నుంచి ప్రముఖ పర్యాటక ప్రదేశమైన లెంబాంగ్‌కు బయల్దేరారు. అదుపుతప్పి ఓ కారును, మూడు ద్విచక్ర వాహనాలను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తొమ్మిది మంది విద్యార్థులు కాగా, ఒక ఉపాధ్యాయుడు, ద్విచక్ర వాహనదారుడు ఉన్నట్లు జావా ప్రావిన్స్ పోలీసు ప్రతినిధి జూల్స్ అబ్రహం అబాస్ట్ తెలిపారు. ఈ ఘటనలో సుమారు 13 మందికి తీవ్ర గాయాలైనట్లు చెప్పారు. మరో 40 మందికి స్వల్ప గాయాలైనట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.