ఆ దేశంలో కరోనా కంట్రోల్.. మే23 నుంచి ఫుట్‌బాల్‌ పోటీలు

కరోనా వైరస్ ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. ఈ మహమ్మరి అన్ని దేశాల్లో మృత్యుభేరి మోగిస్తుంది. స్లొవేనియా దేశం ఓ కబురు అందించింది.

Update: 2020-05-15 13:30 GMT

కరోనా వైరస్ ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. ఈ మహమ్మరి అన్ని దేశాల్లో మృత్యుభేరి మోగిస్తుంది. స్లొవేనియా దేశం ఓ కబురు అందించింది. కరోనా వైరస్‌తో చిగురుటాకులా వణికిన ఇటలీకి స్లొవేనియా సరిహద్దు దేశం కావడం గమనార్హం. ఇప్పుడు ఆ దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి పూర్తిగా కంట్రోల్ అయిందని స్లొవేనియా ప్రకటించింది.

ఆ దేశ ప్రధాని జానెజ్‌ జాన్స యూరోప్ ఖండంలో మహమ్మారికి సంబంధించి స్లొవేనియాలోనే పరిస్థితి అత్యుత్తమంగా ఉంది. కరోనా ముగిసిందని ప్రకటించేందుకు ఇదే మమ్మల్ని పురిగొల్పిందని పేర్కొన్నారు. గురువారానికి అక్కడ దాదాపు వైరస్‌ వ్యాప్తి రేటు తగ్గడంతో పౌరుల కోసం సరిహద్దులు తెరిచింది. ఇతరులు మాత్రం క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని తెలిపింది. సార్స్‌-కొవ్‌2 వ్యాప్తి చెందే ప్రమాదం ఇప్పటికీ ఉండటంతో కొన్ని సాధారణ.. ప్రత్యేక చర్యలు అమల్లో ఉంటాయి అని స్లొవేనియా ప్రకటించింది.

దేశంలో బహిరంగ ప్రదేశాలకు వెళ్తే భౌతికదూరం పాటించాలని, మాస్క్ ధరించాలని సూచించింది. మే23 నుంచి ఫుట్‌బాల్‌, ఇతర క్రీడా పోటీలు మొదలవుతాయని ప్రకటించింది. బహిరంగ ప్రదేశాలకు వెళ్తే భౌతికదూరం పాటించాలని, మాస్క్ ధరించాలని సూచించింది. వచ్చేవారం దుకాణాలు, హోటళ్లు తెరిచేందుకు అనుమతించింది.  

Tags:    

Similar News