కరోనావైరస్ కు ఆ ఇన్స్టిట్యూట్ తో సంబంధం ఉంది : ట్రంప్ సంచలనం

ప్రపంచంలో ఇప్పటివరకు 33 లక్షల 8 వేల 231 మందికి కరోనా సోకింది. 2 లక్షల 34 వేల 105 మరణాలు సంభవించగా, 10 లక్షల 39 వేల 195 మందికి నయమైంది.

Update: 2020-05-01 04:49 GMT
Donald Trump

ప్రపంచంలో ఇప్పటివరకు 33 లక్షల 8 వేల 231 మందికి కరోనా సోకింది. 2 లక్షల 34 వేల 105 మరణాలు సంభవించగా, 10 లక్షల 39 వేల 195 మందికి నయమైంది.దీనివల్ల అమెరికా ఎక్కువగా ప్రభావితమవుతుంది. 10 లక్షల 95 వేల 210 మందికి ఈ వ్యాధి సోకింది, ఇప్పటికి అక్కడ 63 వేల 861 మంది మరణించారు, 1 లక్ష 55 వేల 324 మంది కోలుకొని ఆరోగ్యంగా ఉన్నారు.

కరోనా గురించి సమాచారం ఇవ్వకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై నిప్పులు చెరిగారు.. చైనా కరోనా విషయంలో ఖచ్చితమైన సమాచారం ఇవ్వలేదని.. ఈ వైరస్ కు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజీతో సంబంధం ఉందని ఆయన చెప్పారు. దీనికి తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని.

ఈ ప్రయోగశాలలో కరోనాను తయారు చేశారని ఆరోపించారు. కాగా చైనాపై కొత్త సుంకాలను (కస్టమ్స్) విధించవచ్చని ట్రంప్ అన్నారు. ఇదిలావుంటే ఒక రోజు ముందు, ట్రంప్ వార్తా సంస్థ అయిన రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను నవంబర్‌లో తిరిగి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావాలని చైనా కోరుకోవడం లేదని పేర్కొన్నారు. అమెరికా తదుపరి అధ్యక్షుడిగా నన్ను ఆపడానికి చైనా ఏదైనా చేస్తుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News