Donald Trump: భార‌తీయుల‌ను నియ‌మించుకోవ‌ద్దు.. టెక్ సంస్థ‌ల‌కు ట్రంప్ వార్నింగ్‌

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన జాతీయవాద ఉధృతిని tech రంగంపైనా చూపించారు.

Update: 2025-07-24 08:35 GMT

Donald Trump: భార‌తీయుల‌ను నియ‌మించుకోవ‌ద్దు.. టెక్ సంస్థ‌ల‌కు ట్రంప్ వార్నింగ్‌

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన జాతీయవాద ఉధృతిని tech రంగంపైనా చూపించారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఒక AI సదస్సులో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీశాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలను ఉద్దేశించి ట్రంప్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

టెక్ కంపెనీలు భారతీయులను నియమించుకోవడం మానుకోవాలని, అమెరికన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని ట్రంప్ స్పష్టం చేశారు. విదేశీ ఉద్యోగులను కొనసాగిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. "టెక్ సంస్థలు చైనాలో సంస్థలు ఏర్పాటు చేసి, భారతీయులను నియమించుకుని, ఐర్లాండ్‌లో లాభాలను దాచేస్తున్నాయి. ఇవన్నీ అమెరికాలో లభించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసిన ఫలితాలే. ఇకనుంచి ఈ పరిస్థితులు కొనసాగబోవు," అని అన్నారు.

అమెరికాలోని చాలా టెక్ కంపెనీలు దేశీయ ఉద్యోగులపై దృష్టి పెట్టకుండా, విదేశీయులకు అవకాశాలు కల్పించడాన్ని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. "అమెరికన్లు ఉపేక్షించలేని పరిస్థితి ఇది. మన దేశ అభివృద్ధి కోసం టెక్ రంగంలో కొత్త దేశభక్తి అవసరం. సిలికాన్ వ్యాలీలో పనిచేసే ప్రతి కంపెనీ ముందుగా అమెరికా గురించి ఆలోచించాలి. నా పాలనలో ఇదే ధోరణి ఉండబోతుంది," అని ఆయన స్పష్టం చేశారు.

టెక్ రంగంలో దేశీయులకే ముందుఅవకాశాలు ఇవ్వాలన్న ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి విదేశీ ఉద్యోగుల భవిష్యత్తుపై అనిశ్చితిని తెచ్చేలా ఉన్నాయి.

Tags:    

Similar News