ప్రపంచాన్ని షేక్ చేసిన డీప్‌సీక్: ఎవరీ లువోఫూలి?
Luo Fuli: డీప్ సీక్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లో సంచలనం సృష్టించిన పేరు. చైనాకు చెందిన ఏఐ చాట్ బాట్ డీప్ సీక్ ఆవిష్కరణలో 29 ఏళ్ల యువతి ఉందనే విషయం తెలుసా?
ప్రపంచాన్ని షేక్ చేసిన డీప్‌సీక్: ఎవరీ లువోపులి?
Luo Fuli: డీప్ సీక్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లో సంచలనం సృష్టించిన పేరు. చైనాకు చెందిన ఏఐ చాట్ బాట్ డీప్ సీక్ ఆవిష్కరణలో 29 ఏళ్ల యువతి ఉందనే విషయం తెలుసా? ఆమె ఎవరో కాదు లువోఫూలి. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఏఐలో ఆమె జీనియస్ గా పేరొందారు.
చాట్ జీపీటీ, జెమినీ, క్లాడ్ ఏఐ వంటి వాటికి డీప్ సీక్ చుక్కలు చూపింది. డీప్ సీక్ చాట్ బాట్ అమెరికా స్టాక్ మార్కెట్ ను షేక్ చేసింది. ఆపిల్ స్టోర్ లో డీప్ సీక్ అగ్రస్థానంలో నిలిచింది. డీప్ సీక్ సక్సెస్ కావడంతో దీని వెనుక ఉన్న లువోఫూలి ఎవరు అని అంతా వెతుకుతున్నారు.
ఎవరీ లువో ఫూలి
చిన్న కుటుంబంలో లువో ఫూలి జన్మించారు. అయితే ఆవేమీ ఆమె చదువుకు ఆటంకం కాలేదు. బీజింగ్ నార్మల్ యూనివర్శిటీలో ఆమె సీటు సంపాదించారు.అక్కడ ఆమె కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరారు. పెకింగ్ యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్‌లో కూడా చదువుకున్నారు.ఇక్కడే 2019లో జరిగిన ఏసీఎల్ కాన్ఫరెన్స్ లో సమర్పించిన ఎనిమిది పేపర్లను ఆమె జీవితానికి టర్నింగ్ పాయింట్ గా మారాయి.
ఈ కాన్ఫరెన్స్ కు హాజరైన అలీబాబా, షియోమీ టెక్ కంపెనీలు లువోఫూలి ప్రజేంటేషన్ ను ఆకర్షించాయి. ఇదే ఆమె భవిష్యత్తు విజయాలకు దోహదం చేసింది. ఈ కాన్ఫరెన్స్ తర్వాత అలీబాబా సంస్థకు చెందిన డీఏఎంఓ అకాడమీలో ఆమె పరిశోధకురాలిగా చేరారు. అక్కడే బహుభాష ప్రీ ట్రైనింగ్ మోడల్ వీఈసీఓకు నాయకత్వం వహించారు. దీనికితోడు అలైస్‌మైండ్ ప్రాజెక్టులో కూడా కీలకంగా వ్యవహరించారు.
డీప్ సీక్ లో ఎప్పుడు చేరారు?
డీప్ సీక్ లో ఆమె 2022లో చేరారు. డీప్ సీక్ ను డెవలప్ చేయడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. నేచురల్ లాంగ్వేజీ ప్రాసెసింగ్ లో ఆమెకు మంచి నైపుణ్యం ఉంది. ఇది డీప్ సీక్ వీ-2 రూపకల్పనలో దోహదం చేశాయి. తనకు ఎదురైన ఎదురుదెబ్బలను ఆమె భవిష్యత్తుకు అవకాశాలుగా మలుచుకున్నారు.
షావోమీ సంస్థ వ్యవస్థాపకులు లీ జున్ లువో ఫూలికి 1.4-మిలియన్ డాల్లర్ల వేతనంతో జాబ్ ఆఫర్ చేశారు. ఇది ఇండియన్ కరెన్సీలో 11 కోట్ల రూపాయాలు.
2024లో ఆమె తన బృందంతో ఓ పత్రం సమర్పించారు. ఇది డీప్ సీక్ ఓపెన్ సోర్స్ పరిశోధనలకు ఉపయోగపడింది.డీప్ సీక్ తయారు చేసిన టీమ్ లో కాలేజీ గ్రాడ్యుయేట్లు, కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారితో పాటు తక్కువ ఎక్స్ పీరియన్స్ ఉన్న వారే ఎక్కువ.ఈ టీమ్ లో 150 మంది పనిచేశారు. ఇందులో సాప్ట్ వేర్ ఇంజనీర్లు, పరిశోధకులు కేవలం 31 మంది మాత్రమే.