China: చైనా దెబ్బకు బొంగరాలు తిరిగి గింగరాలు తిరుగుతున్న అమెరికా.. అసలేం జరిగిందంటే?

China
x

China: చైనా దెబ్బకు బొంగరాలు తిరిగి గింగరాలు తిరుగుతున్న అమెరికా.. అసలేం జరిగిందంటే?

Highlights

China:ఇంటర్నల్‌ లోన్స్, ఫిస్కల్‌ డెఫిసిట్‌ లాంటి ఫైనాన్షియల్‌ ఇష్యూస్‌ ప్రభుత్వాన్ని చికాకు పెడుతున్నాయి. ఓవైపు ఇలాంటి సమస్యలున్నా.. మరోవైపు చైనా వృద్ధి సాధిస్తుండడం ప్రపంచ దేశాలను షాక్‌కు గురిచేస్తోంది.

China: ఆర్థిక యుద్ధమన్నారు.. చైనాకు దెబ్బ మీద దెబ్బ అంటూ అగ్రరాజ్య పెద్దలు విర్రవీగారు. సీన్‌ కట్‌ చేస్తే చైనా దుమ్మురేపుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పనిగట్టుకోని మరీ టారిఫ్‌లపై టారిఫ్‌లు విధించినా.. చైనా ఆర్థిక వృద్ధి మాత్రం ఆగకపోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది.


ప్రపంచ వ్యాప్తంగా పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థల మధ్య.. 2025 తొలి త్రైమాసికంలో చైనా 5.4 శాతం వృద్ధిని సాధించడం పెద్ద డిబెట్‌కు దారి తీసింది. ఇంతకీ ఇది ఎలా సాధ్యమైంది? ప్రపంచంలో మిగిలిన దేశాలు ఈ పరిణామాల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ పరిస్థితుల నుంచి ఇండియా ఏం నేర్చుకోవాలి..? ఇక ఈ లెక్కలు చూస్తే ట్రేడ్‌ వార్‌లో అమెరికాపై చైనాదే పైచేయిగా భావించవచ్చా?


చైనాను భారీ దెబ్బతియ్యాలని ట్రేడ్‌ వార్‌ మొదలెట్టిన అమెరికాకు మైండ్‌ బ్లాక్‌ అయ్యిందనే చెప్పవచ్చు. భారీ టారిఫ్‌లతో చైనాకు దిగుబడి తగ్గించాలని భావించిన అమెరికాకు చైనా గట్టి కౌంటరే ఇచ్చింది. తన వ్యాపార వ్యూహాలతో అసలెక్కడ నష్టపోయిందో కనిపించకుండా చూసుకుంది. మార్కెట్లను మెల్లిగా డైవర్ట్ చేసింది. కొత్త పెట్టుబడులకు దారి చూపించింది. అంతేకాదు.. చైనా తన ఉత్పత్తులు తక్కువ ధరలకే అందుబాటులో ఉంచుతూ.. ఇతర దేశాల్లో వాటిపై డిమాండ్ తగ్గకుండా చూసుకుంది.


దీని కారణంగా అమెరికా వేసిన ఆంక్షలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. నిజానికి ట్రంప్‌ ఆంక్షలు విధించిన తేది ఏప్రిల్‌ 2,2025. అయితే జనవరి 20, 2025న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచే చైనాపై బెదిరింపులకు దిగారు. చైనాపై ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తున్నవారిని బ్లాక్‌మెయిల్స్‌ కూడా చేశారు. సెకండరీ టారిఫ్‌ల పేరుతో నానా హంగామా సృష్టించారు. అయితే ఇవేవీ చైనాను ఆపలేకపోయాయి. 2025 మొదటి త్రైమాసికంలో వచ్చిన జీడీపీ గణాంకాలు చూస్తే... చైనా ఆర్థిక వ్యవస్థ కాస్తా కోలుకుంటోందనే కాదు.. తిరిగి దూసుకుపోతుందనే సందేశం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా ప్రయత్నించిన ఆర్థిక ఒత్తిళ్లు, వ్యాపార ఆంక్షలు కొంతవరకే ప్రభావం చూపించాయి. అటు క్రిప్టో, టెక్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో పెట్టుబడుల రూపంలో చైనా దూకుడుగా ఉండడం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంతేకాదు.. అమెరికా సరఫరా గొలుసులపై ఆధారపడే యూరప్, ఆసియా దేశాలకి చైనా అల్టార్‌నేట్‌గా మారింది.

అయితే రానున్న రోజుల్లో చైనా ఫేస్‌ చేయాల్సిన సమస్యలు చిన్నవేమీ కావు. ట్రేడ్‌వార్‌ నుంచి తాత్కాలికంగా బయటపడ్డట్టు కనిపించినా.. లాంగ్‌ టర్మ్‌లో మాత్రం అమెరికా పెడుతున్న ఇబ్బంది పెట్టవచ్చు. డొనాల్డ్‌ ట్రంప్‌ ఆంక్షలు గ్లోబల్ మార్కెట్లలో చైనా ఉనికిపై ప్రభావం చూపే అవకాశముంది. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో అమెరికా మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. చిప్‌ తయారీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో చైనా పైనే ఆధారపడే దేశాలు, ఇప్పుడు కొత్త మార్గాలు వెతుకుతున్నాయి. అంతేకాదు.. చైనా రియల్ ఎస్టేట్ రంగం ఇంకా అస్థిరంగానే ఉంది.


ఎవర్‌గ్రాండే లాంటి స్కాండల్స్‌ మార్కెట్‌పై నమ్మకాన్ని దెబ్బతీశాయి. అంతేకాదు.. ఇంటర్నల్‌ లోన్స్, ఫిస్కల్‌ డెఫిసిట్‌ లాంటి ఫైనాన్షియల్‌ ఇష్యూస్‌ ప్రభుత్వాన్ని చికాకు పెడుతున్నాయి. ఓవైపు ఇలాంటి సమస్యలున్నా.. మరోవైపు చైనా వృద్ధి సాధిస్తుండడం ప్రపంచ దేశాలను షాక్‌కు గురిచేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories