Coronavirus : చైనాలో కొత్త కేసులు లేవు.. ఇదే మొదటిసారి..

ప్రపంచంలో ఇప్పటివరకు 53 లక్షల 6 వేల 158 మందికి వ్యాధి సోకింది.

Update: 2020-05-23 08:13 GMT
Representational Image

ప్రపంచంలో ఇప్పటివరకు 53 లక్షల 6 వేల 158 మందికి వ్యాధి సోకింది. 21 లక్షల 60 వేల 39 మంది కోలుకోగా. మృతుల సంఖ్య 3 లక్షల 40 వేల 40 కు పెరిగింది. అయితే కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలో మాత్రం వ్యాప్తి పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ప్రతిరోజూ ఎన్నోకన్ని పాజిటివ్ కేసులు వచ్చేవి.. అయితే గత 24 గంటల్లో చైనా వ్యాప్తంగా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని ఆ దేశ జాతీయ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. జనవరిలో అధికారులు కరోనా డేటాను నివేదించడం ప్రారంభించినప్పటి నుండి అంటువ్యాధులు ఒక్కరి కూడా రాకపోవడం ఇదే మొదటిసారి.

అయితే గత 24 గంటల్లో ధృవీకరించబడిన కేసులు లేనప్పటికీ, జాతీయ ఆరోగ్య కమిషన్ రెండు కొత్త అనుమానాస్పద కేసులను మాత్రం నివేదించింది.. షాంఘైలో విదేశాలనుంచి వచ్చిన ఓ వ్యక్తికి అలాగే ,ఈశాన్య ప్రావిన్స్ జిలిన్లోమరో వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించాయి. అయితే అవి కూడా ఇంకా నిరాదరణ కాలేదు. 1.4 బిలియన్ల ప్రజలు ఉన్న దేశంలో మొత్తం 82,791 కేసులను ఆరోగ్య అధికారులు నివేదించారు. అధికారిక మరణాల సంఖ్య 4,634 వద్ద ఉంది, ఇది చాలా తక్కువ.


Tags:    

Similar News