చైనాలో మరోసారి పెరిగిన కేసులు

చైనాలో ఉద్భవించిన కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గినట్టే తగ్గి మళ్ళీ ప్రబలుతోంది. మంగళవారం మరో 30 కొత్త కేసులు నమోదయ్యాయి.

Update: 2020-04-22 08:54 GMT
Representational Image

చైనాలో ఉద్భవించిన కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గినట్టే తగ్గి మళ్ళీ ప్రబలుతోంది. మంగళవారం మరో 30 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో 82 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో 77 వేల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 4 వేల పైచిలుకు మరణాలు చైనాలో సంభవించాయి. మరోవైపు చైనాలో తాజాగా నమోదైన ఈ కేసులలో 23 బయటి నుంచి వచ్చినవని చైనా హెల్త్ అడ్మినిస్ట్రేషన్ బుధవారం వెల్లడించింది. 23 మినహా మిగతా ఏడు కేసులు దేశంలోనివే నని జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. ఇక వైరస్ మూడో దశ ప్రారంభం అయిందని వార్తలు వస్తున్న హిలోంగ్జియాంగ్ ప్రావిన్స్లో ఎటువంటి కేసులు నివేదించబడలేదు.

మంగళవారం ఒక్క మరణ కేసు నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. ఇదిలావుంటే చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మంగళవారం షాంకి ప్రావిన్స్‌కు దక్షిణంగా ఉన్న చిన్మి గ్రామాన్ని సందర్శించారు. ఈ గ్రామంలో 188 పేద కుటుంబాలు నివసిస్తున్నాయి. పారిశ్రామిక అభివృద్ధి ద్వారా గ్రామస్తుల జీవితం చాలా మెరుగుపడింది. ఈ గ్రామంలో పేదరిక నిర్మూలన, వాణిజ్య పరిశ్రమల అభివృద్ధి గురించి అధ్యక్షుడు అడిగి తెలుసుకున్నారు.


Tags:    

Similar News