Coronavirus : అమెరికాలో వేగంగా సంభవిస్తోన్న మరణాలు..

యునైటెడ్ స్టేట్స్ (అమెరికా) లో కరోనావైరస్ ప్రమాదకరంగా విజృంభిస్తోంది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంసేకరించిన సమాచారం ప్రకారం.

Update: 2020-04-05 03:51 GMT

యునైటెడ్ స్టేట్స్ (అమెరికా) లో కరోనావైరస్ ప్రమాదకరంగా విజృంభిస్తోంది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంసేకరించిన సమాచారం ప్రకారం.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కేసుల సంఖ్య 300,000 దాటింది, అలాగే మరణాల సంఖ్య 8,100 దాటింది.

మరోవైపు గ్లోబల్ కరోనావైరస్ సంఖ్యను సర్వే చేస్తున్న బాల్టిమోర్ విశ్వవిద్యాలయం, అమెరికాలో 300,915 వైరస్ కేసులు నమోదయ్యాయని, 8,162 మరణాలు సంభవించాయని వెల్లడించింది. ఇదిలావుంటే ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే ఇప్పటివరకు 3,565 మంది మరణించారు.. అంతకుముందు రోజు 2,935 మంది మరణించారు.

అక్కడ 24 గంటల్లో అతిపెద్ద జంప్ నమోదైంది. న్యూయార్క్ మరణాల్లో పురుషులు చాలా ఎక్కువగా మరణిస్తున్నారు, అక్కడ పురుషులు 55 శాతం కేసులు కలిగి ఉంటే, 62 శాతం మరణాలు సంభవించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరోవైపు అమెరికాలో కరోనా మరణాలు మరింత ఎక్కువగా వుంటాయని అధ్యక్షడు ట్రంప్ అన్నారు. అందువల్ల ప్రజలు సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలని సూచించారు. మరోవైపు అమెరికాలో పెరుగుతున్న కేసులతో ప్రజల్లో తీవ్ర బయాందోనళ వ్యక్తమవుతోంది.


Tags:    

Similar News