Coronavirus: కరోనా విలయతాండవం.. 50 మంది డాక్టర్లు బలి
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను కబళిస్తుంది. ఈ మహమ్మారి 7లక్షల 82 వేల మందిపైగా దీని బారిన పడ్డారు.
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను కబళిస్తుంది. ఈ మహమ్మారి 7లక్షల 82 వేల మందిపైగా దీని బారిన పడ్డారు. ఇప్పటిదాకా దాని బారిన పడి 37వేలమంది బలయ్యారు.1,50,732మంది ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నారు. ఈ కరోనా వైరస్ ధాటికి ఇటలీ అతలాకులమవుతోంది. కరోనా కేసులు నమోదు లో చైనా ను మించిపోయింది. ఇటలీలో కోవిడ్ పాజిటివ్ కేసులు లక్షపైగా చేరుకుంటే.. మరణాల సంఖ్య 11,591కి చేరుకుంది.
ఇక కరోనా రోగులకు ట్రీట్మెంట్ చేస్తున్న వైద్యులు దీనికి బలవుతున్నారు. ఒక్క ఇటలీలో ఇప్పటిదాకా 50 మంది డాక్టర్లు కరోనా కారణంతో మరణించినట్లు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆర్డర్స్ ఆఫ్ సర్జన్స్ అండ్ డెంటిస్ట్స్ ప్రెసిడెంట్ ఫిలిపో అనేలి వెల్లడించింది. అందులో 17 మంది వైద్యులు ఎక్కువ ఎఫెక్ట్ ఉన్న లొంబార్డి రీజియన్‌కు చెందిన వారేనని తెలిపింది. ఇప్పటిదాకా దాని బారిన పడి 37,615 మంది బలయ్యారు. 20 వేలకు పైగా మరణాలు ఒక్క యూరప్‌లోనే నమోదయ్యాయి.