Coronavirus: ఐరోపాలోనే 62.5 శాతం కరోనా మరణాలు

ప్రపంచంలో ఇప్పటివరకు 23 లక్షల 30 వేల 937 మందికి కరోనావైరస్ సోకింది. లక్షా 60 వేల 755 మంది మరణించారు.

Update: 2020-04-19 11:29 GMT

ప్రపంచంలో ఇప్పటివరకు 23 లక్షల 30 వేల 937 మందికి కరోనావైరస్ సోకింది. లక్షా 60 వేల 755 మంది మరణించారు.ఇందులో 5 లక్షల 96 వేల 537 మంది కోలుకోవడంతో ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఐరోపాలో ఇప్పటివరకు లక్ష మందికి పైగా మరణించారు. ఇటలీలో అత్యధికంగా 23 వేల 227 మంది మరణించగా.. స్పెయిన్ లో 20 వేల 639 మంది మరణించారు.. ప్రస్తుతం ఈ దేశం ఐరోపాలో రెండవ స్థానంలో ఉంది, ప్రపంచంలోని మొత్తం మరణాలలో 62.5% ఐరోపాలోనే సంభవించాయి.

ఇదిలావుంటే మొత్తం వైరస్ సోకిన రోగులలో మూడింట ఒకవంతు ఒక్క యుఎస్ లోనే ఉన్నారు. అమెరికాలో ఇప్పటివరకూ 39 వేల మందికి పైగా మృతి చెందగా, 7 లక్షలా 38 వేల మంది వ్యాధి బారిన పడ్డారు. న్యూయార్క్‌లో గత 24 గంటల్లో 540 మంది మరణించారు.. దాంతో ఇప్పటివరకు 17 వేల 671 మంది ఈ రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమో కరోనా విపత్తు గురించి మాట్లాడుతూ.. ఆసుపత్రులలో రోగుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని చెప్పారు.


Tags:    

Similar News