ప్రపంచవ్యాప్తంగా పెరిగిన కరోనా మరణాలు..

కరోనా మహమ్మారి అన్ని దేశాలను వణికిస్తోంది. రోజురోజుకు ఈ వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా 13 లక్షల 47 వేల,803 మందికి ఈ వైరస్ సోకింది.

Update: 2020-04-07 05:33 GMT
Representational Image

కరోనా మహమ్మారి అన్ని దేశాలను వణికిస్తోంది. రోజురోజుకు ఈ వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా 13 లక్షల 47 వేల,803 మందికి ఈ వైరస్ సోకింది. ఇప్పటికే దీని బారిన పడి 74వేల 807 మందిపైగా మరణించారు. 2,77402 మంది కోలుకున్నారు.

ఒక్క యూరప్‌లోనే 50,135 మంది మృత్యువాతపడ్డారు. ఇటలీ 1,32,547 పాజిటివ్ కేసులు కాగా.. 16,523 మంది చిపోయారు. స్పెయిన్‌ 1,36,675 మందికి పాజిటివ్, 13,341 మరణాలు , ఇక 8,078 మరణాలతో ఫ్రాన్స్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక జర్మనీ కూడా లక్ష పాజిటివ్‌ కేసుల నమోదయ్యాయి. వెయ్యి మంది మహమ్మారి వల్ల ప్రాణాలు విడిచారు.

మరోవైపు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా తయారైంది. కరోనా లక్షణాలు తీవ్రం కావడంతో ఆయన్ను ఐసీయూకు తరలించారు. దీంతో మరణాలు 5,372కి చేరాయి. 24 గంటల్లోనే స్పెయిన్‌‌లో 637, ఇటలీలో 636 మంది చనిపోయారు. అమెరికాలో ఈ కరోనా పాజిటివ్ కేసు పెరిగిపోయాయి. 367,442 మంది మహమ్మారి బారిన పడ్డారు. ప్రాణాంతక వైరస్ వల్ల అమెరికాలో మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది ఇప్పటికే 10, 900 మందికిపైగా మృత్యువాత పడ్డారు.

Tags:    

Similar News