Coronavirus: 80 దేశాలకు వ్యాపించిన కరోనావైరస్.. పెరిగిన మరణాల సంఖ్య

కరోనావైరస్ ఇప్పటివరకు 80 దేశాలకు వ్యాపించింది. 14 దేశాల్లో ఇప్పటివరకు 3 వేల 286 మంది వైరస్ కారణంగా మరణించారు. చైనాలో ఇప్పటివరకు 3 వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

Update: 2020-03-05 07:48 GMT

కరోనావైరస్ ఇప్పటివరకు 80 దేశాలకు వ్యాపించింది. 14 దేశాల్లో ఇప్పటివరకు 3 వేల 286 మంది వైరస్ కారణంగా మరణించారు. చైనాలో ఇప్పటివరకు 3 వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) 95 వేల మందికి పైగా వైరస్‌ను నిర్ధారించింది. వరల్డ్‌మీటర్ డాటిన్‌ఫో ప్రకారం 56 వేల 975 మందికి నయమైంది.

కరోనావైరస్ ప్రభావం చైనా తరువాత, దక్షిణ కొరియా, ఇటలీ, జపాన్ మరియు ఇరాన్లలో ఎక్కువగా ఉంది. ఇక్కడే అనేక కేసులు నమోదయ్యాయి. అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) ఈ దేశాలకు వెళ్లోద్దని ప్రజలకు సలహా ఇచ్చింది.

ఇక భారతదేశంలో 29 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. బాధితులందరిపై మంత్రుల బృందం నిఘా పెడుతోందని ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ గురువారం చెప్పారు. విదేశాల నుండి వచ్చే వారందరికి 21 విమానాశ్రయాలలో పరీక్షలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.

ఐరోపాలో:

ఎక్కువ కేసులు ఇటలీలో నమోదయ్యాయి. బుధవారం సాయంత్రం నాటికి, ఇక్కడ 3089 మంది పాజిటివ్ తో ఉన్నారు. స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, యుకెలో 85, నార్వేలో 56 మందికి సోకినట్లు గుర్తించారు.

యుఎస్ లో:

న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, అమెరికాలో బుధవారం నాటికి 152 వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఇక్కడ 11 మరణాలు సంభవించాయి. యుఎస్‌లో మరణించిన వారిలో జపాన్ డైమండ్ ప్రిన్సెస్‌లో ప్రయాణించిన వారు ఎక్కువగా ఉన్నారు.

Tags:    

Similar News