దక్షిణాఫ్రికాలో కొన్ని చోట్ల ఆహరం సంక్షోభం.. కారణం ఇదే..

కరోనోవైరస్ వ్యాప్తిని ఆపడానికి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా దేశవ్యాప్తంగా ఐదు వారాల లాక్డౌన్ విధించారు..

Update: 2020-04-20 09:01 GMT
Representational Image

కరోనోవైరస్ వ్యాప్తిని ఆపడానికి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా దేశవ్యాప్తంగా ఐదు వారాల లాక్డౌన్ విధించారు.. అయితే లాక్డౌన్ కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఆహార సంక్షోభం తలెత్తింది. పేదలు ఆకలికి అలమటిస్తున్నారు. స్వచ్చంధ సంస్థలు ఇచ్చే ఆహార పొట్లాలు సరిపోవడం లేదు. దాంతో అన్నం కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు. కొన్ని చోట్ల ఆహరం కోసం గొడవలు జరుగుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో రోజు కూలీలకు ఇబ్బంది ఏర్పడింది. ప్రస్తుతం పరిణామాలపై ప్రజాసంఘాల నాయకుడు జానీ ఫ్రెడరిక్స్ ప్రభుత్వంపై మండిపడ్డారు.. తామంతా ఆహార సంక్షోభంలో ఉన్నామని.. ఇది యుద్ధ పరిస్థితిగా మారిందన్నారు.

ప్రజలు ఆహార పదార్ధాల కోసం దుకాణాలకు క్యూలు కట్టారు. ఈ క్రమంలో సరుకులకోసం ప్రజలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. దీనికి ప్రత్యక్ష కారణం ఆకలి అని ఆయన అన్నారు. కాగా మార్చి 27 నుండి సౌత్ ఆఫ్రికాలోని కొందరు పేదలు ఆకలితో అలమటిస్తున్నారని.. సరుకులు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు చెందుతున్నారని ఆయన అన్నారు. మరోవైపు ఆహరం కోసం పోరాటం చేస్తున్న ప్రజలపై రబ్బరు బుల్లెట్లతో దాడి చేస్తున్నారని.. పరిస్థితిని నియంత్రించడానికి సైన్యాన్ని మోహరిస్తున్నారని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News