సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్.. WHO కు నిధుల నిరాకరణ

అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనావైరస్ వ్యాప్తికి ప్రతిస్పందనగా WHO తన ప్రాథమిక విధిలో విఫలమైందని

Update: 2020-04-15 04:27 GMT
Donald Trump (File Photo)

అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనావైరస్ వ్యాప్తికి ప్రతిస్పందనగా WHO తన ప్రాథమిక విధిలో విఫలమైందని.. దాంతో who కు నిధులు నిలిపివేశారు. చైనాలో వైరస్ వెలువడిన తరువాత యుఎన్ బాడీ దానిని కప్పిపుచిందని ఆరోపించారు.. దీనికి జవాబుదారీతనం ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

కొంతకాలంగా WHO చైనా పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తోందని ట్రంప్ గతంలో ఆరోపించారు. అందుకు తగ్గట్టే తాజాగా విమర్శలు గుప్పించారు ట్రంప్.. WHO ప్రారంభం నుంచి యుఎస్ WHO కు అతిపెద్ద సింగిల్ ఫండర్, ఇది ప్రతి సంవత్సరం 400 మిలియన్ డాలర్లను అందిస్తుంది..

ఇది మొత్తం బడ్జెట్లో 15%. మిగిలిన దేశాలు జనాభా ప్రాతిపదికన ఇస్తుంటాయి.. అయితే యూఎస్ ఈ నిర్ణయం తీసుకోవడంపై WHO నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు. వాస్తవానికి మహమ్మారిపై పోరాడటానికి ఈ సంస్థ మార్చిలో 75 మిలియన్ డాలర్లు కావాలని విజ్ఞప్తి చేసింది.

తాజాగా వ్యాప్తి మరింత పెరుగుతుండటంతో కనీసం ఒక బిలియన్ కావాలని ప్లాన్ రెడీ చేసుకుంది. ఈ క్రమంలో అమెరికా నిధులు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. కాగా కరోనావైరస్ మహమ్మారి కారణంగా 608,377 కేసులు, 25,981 మరణాలతో అమెరికా ఎక్కువగా నష్టపోయిన దేశంగా ఉంది.


Tags:    

Similar News