Coronavirus: అమెరికాలో భారీగా పెరిగిన కరోనా వైరస్ మరణాలు..

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది.

Update: 2020-04-10 03:10 GMT

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది.జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం.. మరణాల సంఖ్య 16,527 గా ఉంది.. 24 గంటల్లోనే 15 వందలకు పైగా మరణాలు నమోదయ్యాయి. అంతేకాదు మొత్తం కేసులు అర మిలియన్ కు దగ్గరగా ఉన్నాయి.. ప్రస్తుతం అమెరికాలో 460,967 కరోనావైరస్ కేసులు ఉన్నాయి. అమెరికాలో కరోనా వ్యాప్తికి కేంద్రంగా ఉన్న న్యూయార్క్ రాష్ట్రంలో ధృవీకరించబడిన కేసుల సంఖ్య 159,937 కు చేరుకుంది.

దీంతో పెరుగుతున్న మారణాలపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనావైరస్ టాస్క్ ఫోర్స్ సమీక్షా సమావేశంలో పాల్గొన్న ట్రంప్ "యునైటెడ్ స్టేట్స్లో రెండు మిలియన్ పరీక్షలు పూర్తయ్యాయి " అని అన్నారు, ఈ పరీక్షలు "అత్యంత అధునాతనమైన , అత్యంత ఖచ్చితమైనవి" గా ట్రంప్ చెప్పారు.

కాగా కరోనావైరస్ మహమ్మారి తో తీవ్రమైన ఆర్థిక పతనంతో అమెరికా ఉన్నందున, ఆరు నెలల వరకు విద్యార్థుల రుణ చెల్లింపులు మాఫీ అవుతాయని అధ్యక్షుడు ట్రంప్ గురువారం కరోనావైరస్ టాస్క్ ఫోర్స్ బ్రీఫింగ్ సందర్భంగా ప్రకటించారు. 


Tags:    

Similar News