Coronavirus: పలు దేశాల్లో మళ్లీ కరోనా విజృంభణ

Coronavirus: యూరప్‌ దేశాల్లో పెరిగిన కోవిడ్ ఉద్ధృతి

Update: 2021-11-08 15:52 GMT

Representational Image

Coronavirus: పలు దేశాల్లో కోవిడ్‌ వైరస్‌ విజృంభణ మరోసారి మొదలయ్యింది. ప్రధానంగా యూరప్‌ దేశాల్లో మరోసారి వైరస్‌ ఉద్ధృతి పెరిగింది. ఇందుకు రూపాంతరం చెందిన కొత్త వేరియంట్‌ కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఆందోళనల నేపథ్యంలో భారత్‌లో దీని ప్రభావం తక్కువేనని ఇక్కడి నిపుణుల బృందం స్పష్టం చేసింది. దేశం ‎AY 4.2 వేరియంట్‌ వ్యాప్తి పెరుగుతుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని ఇన్సాకాగ్‌ వెల్లడించింది. ఇప్పటివరకు వ్యాప్తిలో ఉన్న వేరియంట్‌ ఆఫ్‌ ఇంటెరెస్ట్‌, వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌లతో పోలిస్తే దీని ప్రభావం 0.1శాతం కంటే తక్కువగా ఉందని వెల్లడించింది.

Tags:    

Similar News