Rahul Gandhi: తెలుగు భాషలో చరిత్ర, సంస్కృతి.. అమెరికాలో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ప్రవాసీయులతో ముచ్చటించిన రాహుల్..తెలుగు భాషపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు భాష ముఖ్యం కాదంటే ఆ ప్రాంత ప్రజలను, వారి చరిత్ర, సంస్క్రుతిని అవమానించినట్లే అన్నారు.
Rahul Gandhi: తెలుగు భాషలో చరిత్ర, సంస్కృతి.. అమెరికాలో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత, లోకసభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. డల్లాస్ లోని ప్రవాస భారతీయులతో రాహుల్ ముచ్చటించారు. మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. భాషలు, సంప్రదాయాల పేరుతో ఎవన్నీ వేరు చూడకూడదన్నారు. ఈ సందర్భంగా తెలుగు భాష గురించి రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
భారత జాతీయ గీతం అన్ని రాష్ట్రాలను ప్రతిబింబిస్తుంది అందర్నీ సమానంగా చూపిస్తుంది. అంతేకానీ ఒక రాష్ట్రం బెస్ట్..మరో రాష్ట్రం సెకండ్ బెస్ట్ అని ఎక్కడా ఉండదు. ఈ గీతం మన దేశాన్ని రాష్ట్రాల సమాఖ్యగా చెబుతోంది. అలాంటప్పుడు ఒక రాష్ట్రం కంటే మరొక రాష్ట్రం ఎక్కువ కాదు..తక్కువ కాదు. భాష, సంప్రదాయాలు కూడా అంతే. తమిళం మాట్లాడేవారు మాకు ఇష్టం ఉండదని..హిందీ మాట్లాడేవారే మాకు ఇష్టమంటూ చెప్పడం సరికాదని వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ.
మనం తెలుగు గురించి చర్చిస్తున్నప్పుడు అది కేవలం భాష మాత్రమే కాదు..ఒక చరిత్ర, ఒక సంప్రదాయం, సంస్క్రుతి. హిందీతో పోల్చి చూస్తే తెలుగు భాష ముఖ్యం కాదని ఒకవేళ ఆ రాష్ట్ర ప్రజలకు చెబితే..వారిని అవమానించినట్లే అవుతుంది. అలా పోలుస్తూ తెలుగు చరిత్ర, అక్కడి సంప్రదాయం, సంస్క్రుతి, పూర్వీకులు ముఖ్యం కాదని మీరు అన్నట్లేనని రాహుల్ అన్నారు. ఈ చిన్న తేడాను కూడా అర్థం చేసుకుని కొందరి వల్లే భారత్ లో దీనికోసం పోరాటం జరుగుతుందంటూ బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.