జాబిల్లిపై ప్రయోగాల్లో మరో ముందడుగు.. త్వరలో భూమిపైకి జాబిల్లి నమూనా

Update: 2020-11-25 06:05 GMT

జాబిల్లిపై ప్రయోగాలకు చైనా మరో ముందడుగు వేసింది. చంద్రుడి నమూనాలు భూమిపైకి తీసుకొచ్చేందుకు మానవరహిత వ్యోమనౌకను విజయవంతంగా కక్ష్యలోకి పంపింది. చైనా పంపిన ఈ వ్యోమనౌక చంద్రుడిపై నమూనాలు సేకరించి భూమికి తీసుకురానుంది.

జాబిల్లి నమూనాల సేకరణ కోసం గత నలభై ఏళ్లుగా ప్రయోగాలు నిలిచిపోగా మళ్లీ చైనా ఈ ప్రయోగాన్ని పునరుద్ధరించింది. గతంలో అమెరికా మానవ సహిత వ్యోమనౌకను పంపగా రష్యా మానవ రహిత ప్రయోగం చేసింది. ఆ తర్వాత చైనాదే తొలి ప్రయోగం. చంద్రుడి నుంచి వచ్చే నమూనాలతో నీరు, ఆక్సిజన్ తయారుచేయొచ్చని గత ప్రయోగాలు వెల్లడించాయి. దీంతో జాబిలిపై అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి తాజా నమూనాలు ఉపయోగపడతాయని చైనా తెలిపింది.

Full View


Tags:    

Similar News