వామ్మో చైనాలో మళ్లీ కరోనా అట! లాక్ డౌన్‌, క‌ఠిన ఆంక్ష‌లు..

Coronavirus: ప్రపంచాన్ని కరోనాతో ఆగంపట్టించిన చైనాను మాత్రం ఆ మహమ్మారి వదిలపెట్టేలా లేదు.

Update: 2022-03-11 15:00 GMT

వామ్మో చైనాలో మళ్లీ కరోనా అట! లాక్ డౌన్‌, క‌ఠిన ఆంక్ష‌లు..

Coronavirus: ప్రపంచాన్ని కరోనాతో ఆగంపట్టించిన చైనాను మాత్రం ఆ మహమ్మారి వదిలపెట్టేలా లేదు. కరోనా స్ప్రెడ్ గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేయకుండా వైరస్ ను వేగంగా అన్ని దేశాలకు అంటించి. ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టిన చైనాలో ఇప్పుడు ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందట. మూడు వారాల క్రితం వంద కేసులు మాత్రమే నమోదు కాగా ఇప్పుడు వారం రోజుల్లోనే వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయని డ్రాగన్ టెన్షన్ పడుతోందట. చైనా వాణిజ్య రాజధాని షాంఘైలో పలు ప్రాంతాల్లో స్ట్రిక్ట్ లాక్ డౌన్ అమలు చేస్తున్నారట. బీజింగ్ లోని అనేక ప్రాంతాల్లో విద్యార్థులను స్కూళ్లకు పంపించకుండా ఆన్ లైన్ క్లాసులకే పరిమితం చేస్తున్నారని వార్తలు గుప్పుమంటున్నాయ్.

ప్రపంచమంతా కరోనా మహమ్మారి నుంచి ఊపిరి పీల్చుకుంటోంది. కరోనా పీడ విరగడైందని జనం హ్యాపీగా ఉంటున్నారు. కానీ చైనా మాత్రం కరోనాతో తల్లడిల్లుతోందట. చైనా నుంచి సమాచారం బయటకు రావడం అది కూడా అక్కడ కరోనా కోరలు చేస్తోందనడం ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో సంచలనంగా మారింది. చైనాలో ఆందోళనకారుల తలలు తెగిపడ్డా బయట ప్రపంచానికి అసలు సమాచారమే ఉండదు. చైనా పాలకులు అక్కడేం జరుగుతుందో కూడా ప్రపంచానికి అసలంటే అసలే తెలియనివ్వరు. వారి బండారం బయటపడుతుందని ఆందోళన చెందుతారు. కరోనా వార్తలకు సంబంధించి న్యూస్ సోషల్ మీడియా ద్వారా లీక్ చేస్తున్న సామాజిక కార్యకర్తలను వదలకుండా వేటాడుతోందట చైనా సర్కారు. ఆస్పత్రుల్లో భారీగా క్యూ లైన్లు ఉంటున్నాయని టెస్టుల కోసం జనం ఎగబడుతున్నారని వార్తలు మాత్రం లీక్ అవుతూనే ఉన్నాయ్. 

Tags:    

Similar News