China and Pakistan Bio-War: చైనా-పాక్ కుట్ర.. భారత్ సహా ఈ దేశాలకు వ్యతిరేకంగా బయో-వార్

Update: 2020-07-24 06:48 GMT

China and Pakistan Bio-War: భారత దేశంపై పొరుగు దేశాలు చైనా, పాకిస్తాన్ కుట్రలకు పాల్పడుతున్నాయి. ఇండియాపై బయో-వార్ దాడుల కోసం ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఈ విషయాన్నీ నిఘా వర్గాలు గుర్తించాయి. చైనా మరియు పాకిస్తాన్ కలిసి 'బయోలాజికల్ వార్ఫేర్' అంటే భారతదేశం మరియు పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా బయో-వార్ కు కుట్ర చేస్తున్నాయి. ఇందుకోసం ఇరు దేశాలు మూడేళ్ల రహస్య ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయి. వీటిలో ప్రాణాంతకానికి సంబంధించిన అనేక పరిశోధన ప్రాజెక్టులు ఉన్నాయి. ముఖ్యంగా ఆంత్రాక్స్ వైరస్ లాంటివి ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ ది క్లాక్సన్ అనే వార్త సంస్థ నివేదించింది. భద్రతా నిపుణుడు ఆంథోనీ క్లాన్ దీనిపై వ్యాసం రాశారు.

ప్రముఖ వార్తా సంస్థ దానిని ప్రచురించింది. ఆ నివేదికలో ఉన్నదాని ప్రకారం, అమెరికా చెబుతున్న వుహాన్ ల్యాబ్ పాకిస్తాన్‌తో బయో-వార్ కి సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భారతదేశం తోపాటు అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు కూడా లక్ష్యంగా ఉన్నాయి. అంటు వ్యాధులను లక్ష్యంగా చేసుకొని బయో వార్ కు తెరతీయాలని ప్రణాళిక రచించినట్టు పేర్కొంది. ఇందుకు కావలసిన పరిశోధన ఖర్చును చైనాకు చెందిన వుహాన్ ల్యాబ్ భరిస్తుంది. ఇందుకోసం నేల నమూనా పరీక్షలు కూడా జరిగాయి. పాకిస్తాన్ శాస్త్రవేత్తలకు చైనా నుంచి డేటా తోపాటు ఇతర ముఖ్యమైన సమాచారం కూడా పంపించినట్టు ఆంథోనీ క్లాన్ పేర్కొన్నారు.   

Tags:    

Similar News