కిర్గిజ్‌స్థాన్‌ టియాన్‌ షెన్ పర్వతాల్లో హిమపాతం

ఒళ్లు గుగుర్పొడిచే హిమపాత దృశ్యాన్ని... కెమెరాలో బంధించిన బ్రిటన్‌ పర్యాటకుడు షిమ్మిన్స్‌

Update: 2022-07-11 12:00 GMT

కిర్గిజ్‌స్థాన్‌ టియాన్‌ షెన్ పర్వతాల్లో హిమపాతం

Kyrgyzstan: హఠాత్తుగా భారీ వరదనో హిమపాతమో ముంచుకు వస్తే ఏం చేస్తారు? ప్రాణాలను దక్కించుకునేందుకు భయంతో పరుగులు తీస్తారు. పరుగులు తీయలేనివారు ప్రాణాలను కోల్పోతారు. రెండ్రోజుల క్రితం అమర్‌నాథ్‌ క్షేత్రంలో జరిగిన ప్రమాదం అలాంటిది. అందులో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది గల్లంతయ్యారు. అమర్‌నాథ్‌లో రిస్క్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. అయితే భారీ హిమపాతం ఉగ్ర రూపమెత్తి ముంచుకొస్తుంటే కిర్గిజ్‌స్థాన్‌లో కొందరు పర్యాటకులు మాత్రం ప్రాణభయంతో పరుగులు పెట్టలేదు. హిమపాత ఉగ్రరూపాన్ని తమ కెమరాల్లో బంధించారు. కొండల్లో నుంచి భారీ వేగంతో దూసుకొస్తున్న హిమపాతాన్ని అత్యంత దగ్గర నుంచి చిత్రీకరించారు. చిత్రీకరిస్తున్న వ్యక్తిపై నుంచి మంచు దూసుకెళ్లింది.

బ్రిటన్‌, అమెరికాకు చెందిన 9 మంది పర్యాటకుల బృందం కిర్గిజ్‌స్థాన్‌లోని టియాన్‌ షెన్‌ పర్వతాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లారు. బ్రిటన్‌కు షిమ్మిన్స్‌ అనే ఓ పర్యాటకుడు టియన్‌ షెన్ పర్వతాలపై ఫొటోలు తీస్తుండగా మంచు పగిలిన శబ్దం వినిపించిందట ఒళ్లు జలధరించే భయంకరమైన హిమపాత దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. ఆ దృశ్యాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. హిమపాతం మంచుకొస్తున్న సమయంలో మిగిలిన 8 మంది గైడ్‌తో వేరే ప్రాంతంలో ఉన్నారని షిమ్మిన్స్‌ తెలిపాడు. అంతేకాడు హిమపాతాన్ని కాపాడుకునేందుకు కూడా తనకు ఓ ఆశ్రయం ఉందని తెలిసే ఈ దృశ్యాలను కెమెరాలో బంధించినట్టు తెలిపారు. హిమపాతం మరో ఐదు నిమిషాలు ఎక్కువ ఉంటే మాత్రం తామంతా చనిపోయేవారమని చెప్పుకొచ్చాడు. హిమపాతం కారణంగా ఎవరూ చనిపోలేదని కేవలం ఒకిరికి మాత్రమే గాయాలైనట్టు షిమ్మన్స్‌ స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.

Tags:    

Similar News