పలు కంపెనీలు సంచలన నిర్ణయం.. వారంలో పని దినాలను 4 రోజులకు కుదింపు..

4-day working week: బ్రిటన్‌ కంపెనీలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి.

Update: 2022-11-28 14:30 GMT

పలు కంపెనీలు సంచలన నిర్ణయం.. వారంలో పని దినాలను 4 రోజులకు కుదింపు..

4-day working week: బ్రిటన్‌ కంపెనీలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. పని దినాలను వారంలో నాలుగు రోజులకు కుదించాయి. పలు కంపెనీలు పని దినాలను తగ్గించేందుకు సిద్ధమయ్యాయి. ఉద్యోగులకు పని బారం, ఒత్తిడి తగ్గించేందుకు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని రోజులుగా బ్రిటన్‌లో నాలుగు రోజుల పని దినాలు కల్పించాలంటూ కార్పొరేట్‌ కంపెనీల ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటివరకు శని, ఆదివారాలను వీకెండ్‌ కింద పరిగణించేవారు. కంపెనీల తాజా నిర్ణయంతో శుక్ర, శని, ఆదివారాలు సెలవు దినాలు కానున్నాయి. అయితే పని దినాలను తగ్గించారని వేతనాలను కుదించరు. ఇదివరకు ఎంత జీతం చెల్లించేవో.. అలాగే చెల్లించనున్నట్టు పలు కంపెనీలు తెలిపాయి. ప్రస్తుతం నాలుగు రోజులకు పని దినాలు కుదింపు ప్రయోజనాన్ని 3వేల మంది ఉద్యోగులు పొందనున్నారు. లండన్‌లోని అతి పెద్ద కంపెనీలు ఆటమ్‌ బ్యాంక్‌, గ్లోబల్‌ మార్కెటింగ్‌ కంపెనీ అవిన్‌ కూడా జఈ జాబితాలో ఉన్నాయి.

నిజానికి ఐరోపా సమాఖ్య దేశాల్లో పలు కంపెనీలు పని దినాలను వారంలో నాలుగు రోజులకు తగ్గించాయి. కానీ బ్రిటన్‌లో మాత్రం కంపెనీలు ఇప్పటివరకు నిరాకరిస్తూ వస్తున్నాయి. అయితే ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అంతేకాదు కొత్తగా ఉద్యోగులు చేరడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో పలు కంపెనీలు పునరాలోచనల్లో పడ్డాయి. ఉన్న ఉద్యోగులు కంపెనీలను వీడకుండా పలు కంపెనీలు వారంలో నాలుగు రోజుల పని దినాలకు సముఖతను వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో ప్రయోగాత్మకంగా కొన్ని కంపెనీలు ప్రవేశపెట్టాయి. ఆయా కంపెనీల్లో ఉద్యోగుల పని తీరు మెరుగుపడితే మరిన్ని కంపెనీలు ఆ దిశగా అడుగులు వేయనున్నాయి. అదే జరిగితే ఐరోపాలో కొత్త ఉద్యోగాల్లో చేరడానికి పలువురు ఆసక్తి చూపించే అవకాశం ఉంది.

Tags:    

Similar News