Viral Video: చూస్తుండగానే కుప్పకూలిన ఎత్తైన బ్రిడ్జ్.. ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు

South Korea Bridge collapsed: రోడ్డుకు అడ్డంగా నిర్మించిన ఎత్తయిన బ్రిడ్జి చూస్తుండగానే కుప్పకూలింది.

Update: 2025-02-25 08:37 GMT

Viral Video: చూస్తుండగానే కుప్పకూలిన ఎత్తైన బ్రిడ్జ్.. ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు

South Korea Bridge collapsed


రోడ్డుకు అడ్డంగా నిర్మించిన ఎత్తయిన బ్రిడ్జి చూస్తుండగానే కుప్పకూలింది. దక్షిణ కొరియాలో నిర్మాణంలో ఉన్న ఎక్స్‌ప్రెస్ వే వద్ద మంగళవారం ఉదయం 9:50 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. దేశ రాజధాని సియోల్‌కు 65 కిమీ దూరంలోని అన్సియాంగ్‌లో ఈ వంతెన నిర్మాణం జరుగుతోంది. వంతెన కూలిన ఘటనలో ఇద్దరు చనిపోగా మరో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులలో ముగ్గురు శిథిలాల కిందనే చిక్కుకున్నారు.

బ్రిడ్జి కూలిపోతుండగా కింద ఉన్న రహదారిపై వెళ్తున్న వాహనదారులు ఆ దృశ్యాన్ని రికార్డ్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది.

వీడియోను గమనిస్తే... వంతెన పిల్లర్స్ అలా ఉండగానే మధ్యలో ఉన్న వంతెన కూలిపోవడం చూడొచ్చు. వంతెన కూలిపోవడంతో పెద్ద ఎత్తున దుమ్ము ఆ ప్రాంతాన్ని కప్పేసింది.

ఈ ఘటనపై సౌత్ కొరియా నేషనల్ ఫైర్ ఏజెన్సీ స్పందించింది. బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో ఇద్దరు చనిపోయారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయని సౌత్ కొరియా నేషనల్ ఫైర్ ఏజెన్సీ వెల్లడించింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

దక్షిణ కొరియా కార్మిక శాఖ లెక్కల ప్రకారం 2020 - 2023 మధ్య కాలంలో దక్షిణ కొరియాలో 8000 పైగా కార్మికులు పనిచేసే చోట ప్రమాదాలతో మృతి చెందినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News