కరోనా విరుగుడుకు నాటుసారా.. వదంతులతో 27 మంది మృత్యువాత

Update: 2020-03-10 04:11 GMT
Fire fighters Corona (File Photo Thesun)

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో వెలుగు చూసిన ఈ వైరస్ ఇరాన్, ఇటలీ, దక్షిణ కొరియా దేశాల్లో ఎంతో మందిని బలితీసుకుంది. కరోనాపై సోషల్ మీడియాలో అనేక వదంతులు వస్తున్నాయి. కరోనాకు వ్యాధి నివారణకు సంబంధించిన చర్యలు, ముందు జాగ్రత్త చర్యలు ప్రమాదకరంగా పరిణమించాయి. సారాలో కరోనా రాదనే ప్రచారాన్ని నమ్మి 27మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇరాన్ లో చోటుచేసుకుంది. 218 మంది చావుబతుకుల్లో పోరాడుతున్నారు. ఇరాన్ మాజీ దౌత్యవేత్త, టెహ్రాన్ పార్లమెంటు సభ్యుడు కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు.

ఇరాన్‌లో ఇప్పటివరకు 7 వేలమందికి పైగా కరోనా వైరస్ బారినపడ్డారు. కరోనా వైరస్‌తో సోమవారం ఒక్కరోజే 43 మంది మరణించారు. రోజురోజుకు అక్కడ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తించెందడంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సోషల్ మీడియాలో కోవిడ్ 19కు నివారణకు నాటుసారా పనిచేస్తుందన్న వదంతులు విస్తృత ప్రచారం జరుగుతోంది. దీంతో తమకు కరోనావైరస్ సోకిందని భావించిన అధికంగా నాటుసారా తాగి తీవ్ర అస్వస్థతకు గురై 27మంది మరణించారు. ఖుజెస్థాన్‌ ప్రావిన్సుల్లో అత్యధికంగా 20 మంది మృత్యువాతపడగా.. అల్బోర్జ్‌‌లో 7గురు ప్రాణాలు కోల్పోయారు. అహ్‌జ్ నగరంలోని కరోనా వైరస్‌కు

కరోనా వైరస్‌కు విరుగుడుకు అహ్‌జ్ నగరంలోని చాలా మంది నాటుసారా సేవించి, అస్వస్థతకు గురయ్యారని అహ్‌జ్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అధికార ప్రతినిధి అలీ ఎహస్‌పోర్ తెలిపారు. కరోనా వైరస్ ఖుజెస్థాన్ ప్రావిన్సుల్లో 73 మందికి సోకినట్టు గుర్తించారని పేర్కొన్నారు. 218 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని అలీ ఎహస్‌పోర్ తెలిపారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. అల్బోర్జ్‌ ప్రావిన్సుల్లో నాటుసారా తాగి ఏడుగుర్ని బలితీసుకుందని డిప్యూటీ మేయర్ అఘ్యారీ తెలియజేశారు. సారా ఎక్కువగా సేవిస్తే దానిలో ఉన్న మిథనాల్ వల్ల కంటి చూపు కోల్పోవడమే కాకుండా.. మరణానికి దారితీస్తోంది.

  

Tags:    

Similar News