బంగ్లా జాతిపిత, ప్రస్తుత ప్రధాని తండ్రి హత్య కేసులో.. మాజీ సైనికాధికారికి ఉరి

బంగ్లాదేశ్‌ జాతిపిత, షేక్‌ ముజీబుర్‌రహమాన్‌ హత్యకేసులో మరో సైనిక మాజీ అధికారికి ఆ దేశం శనివారం రాత్రి ఉరిశిక్ష అమలుచేసింది.

Update: 2020-04-12 09:36 GMT
Mujibur Rahman

బంగ్లాదేశ్‌ జాతిపిత, షేక్‌ ముజీబుర్‌రహమాన్‌ హత్యకేసులో మరో సైనిక మాజీ అధికారికి ఆ దేశం శనివారం రాత్రి ఉరిశిక్ష అమలుచేసింది.హత్య జరిగిన దాదాపు 45 సంవత్సరాల తరువాత బంగ్లాదేశ్ అధికారులు శిక్ష అమలు చేశారు. మాజీ మిలటరీ కెప్టెన్ అబ్దుల్ మజేద్‌ను అయిన దేశ రాజధాని ఢాకా సమీపంలోని కేరనిగంజ్‌లోని సెంట్రల్ జైలులో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఉరితీసినట్లు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, బ్రిగేడ్ జనరల్ ఎకెఎం ముస్తఫా కమల్ పాషా తెలిపారు. 1975లో సైన్యం తిరుగుబాటు చేసి ముజీబుర్‌ రెహమాన్‌ తోపాటు ఆయన కుటుంబసభ్యులను దారుణంగా కాల్చి చంపింది.

ఈ కుట్రలో అబ్దుల్ మజేద్‌ పాలుపంచుకున్నట్లు అప్పట్లోనే తేలింది.. దాంతో ఆయనను నిన్న ఉరి తీశారు. మజేద్ కూడా ఈ హత్యలో తన ప్రమేయం ఉందని బహిరంగంగా ప్రకటించాడు.. హత్య అనంతరం చాలా సంవత్సరాలు భారతదేశంలో దాక్కున్నారు. క్షమాబిక్ష కోరుతూ మజేద్ దాఖలు చేసిన అభ్యర్ధనను అధ్యక్షుడు ఎం అబ్దుల్ హమీద్ తిరస్కరించడంతో ఈ ఉరిశిక్ష అమలైంది.

ఈ కేసు విషయంలో 2009 లో దేశ సుప్రీంకోర్టు 12 మందికి మరణశిక్షను విధించింది.. ముద్దాయిలలో మజేద్ కూడా ఒకరు. ఆగష్టు 15, 1975 లో వీరికి ట్రయల్ కోర్టు వారికి మరణశిక్ష విధించింది, అయితే 2010 లో, హత్యలో పాల్గొన్నట్లు అంగీకరించిన మరో ఐదుగురిని ఉరితీశారు. మరోవైపు జింబాబ్వేలో సహజ కారణాలతో ఒక వ్యక్తి మరణించాడు.

మజేద్‌ తో సహా హత్యలో పాలుపంచుకున్న మరో ఇద్దరు దోషులు.. విదేశాల్లో బ్రతికే ఉన్నారు.. వారిలో ఒకరు కెనడా లో, మరొకరు అమెరికా లో ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఉరికి ముందు మజేద్‌ భార్య మరియు ఇతర కుటుంబ సభ్యులు శనివారం చివరిసారిగా కేంద్ర కారాగారంలో ఆయనను కలిశారు. కాగా రెహమాన్ ప్రస్తుత ప్రధాని షేక్ హసీనాకు తండ్రి, ఆమె చెల్లెలు షేక్ రెహానా తోపాటు హసీనా మాత్రమే బతికి ఉన్నారు.


Tags:    

Similar News