America: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి

America: చికాగోలో విద్యార్థి సయ్యద్ మజాహిర్‌పై దాడి

Update: 2024-02-07 05:14 GMT

America: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి

America: హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ మజాహిర్‌ అలీపై అమెరికాలో దాడి చేశారు. హోటల్‌ నుంచి ఇంటికి వెళ్తున్న అతడిపై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తల, ముక్కు, కళ్లపై గాయాలయ్యాయి. రక్తంతో తడిసిన మజాహిర్‌ అలీ.. తనపై జరిగిన దాడిని వీడియో ద్వారా వెల్లడించారు. ఈ వీడియోతోపాటు చికాగోలోని కాంప్‌బెల్‌లో ఇంటి వద్ద అతడిని దుండగులు వెంబడించిన సీసీ కెమెరా దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇండియానా వెస్లయన్‌ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్‌ చదివేందుకు అలీ కొన్ని నెలల క్రితమే అమెరికాకు వెళ్లాడు.

Tags:    

Similar News