కరోనాకట్టడికి 'Apple' నుంచి భారీ సాయం ప్రకటించిన టిమ్ కుక్

కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు భారీ విరాళాలు ఇస్తున్నారు.

Update: 2020-04-06 08:07 GMT
Tim Cook (File Photo)

కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు భారీ విరాళాలు ఇస్తున్నారు. తాజాగా ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా భారీ సాయం ప్రకటించారు. యుఎస్ అలాగేఐరోపాలోని ఆరోగ్య నిపుణులకు ఆపిల్ మిలియన్ల ముసుగులను విరాళంగా ఇవ్వనున్నట్లు కుక్ వెల్లడించారు. అలాగే ఆస్పత్రులకు అవసరమైన మెడికల్ పరికరాలు అందించడంలో కంపెనీ సహాయపడుతుందని అన్నారు. ఆపిల్ ఇప్పటివరకు తన సరఫరా ద్వారా ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్ మాస్క్‌లను సేకరించిందని చెప్పారు. అంతేకాదు ఈ కష్టసమయంలో వైద్య అవసరాల కోసం కోసం ఆపిల్ కస్టమ్ ఫేస్ షీల్డ్స్ పై కూడా పనిచేస్తోందని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో 2 నిమిషాల నిడివిగల వీడియో ద్వారా కుక్ ఈ ప్రకటన చేశారు.

అందులో ఈ విధంగా పేర్కొన్నారు.. "మా డిజైన్, ఇంజనీరింగ్, ఆపరేషన్స్ మరియు ప్యాకేజింగ్ బృందాలు వైద్య కార్మికుల కోసం మాస్కులను రూపొందించడానికి, ఉత్పత్తి చేయడానికి అలాగే వాటిని రవాణా చేయడానికి సరఫరాదారులతో కలిసి పనిచేస్తున్నాయి" అని చెప్పారు. ఇందుకోసం మొదటి బ్యాచ్‌ను ఆపిల్ ఇప్పటికే కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలోని కైజర్ ఆసుపత్రికి పంపించింది. దీనిపై కూడా మాట్లాడుతూ.. "మా మొదటి రవాణా గతవారం శాంటా క్లారా వ్యాలీలోని కైజర్ ఆసుపత్రికి పంపిణీ చేయబడింది, వైద్యుల నుండి వచ్చిన అభిప్రాయం చాలా సానుకూలంగా ఉంది.' అని చెప్పారు కుక్.



Tags:    

Similar News