కరోనా ఎఫెక్ట్: చైనాలో ఉన్న అమెరికన్లు సైనిక స్థావరాలకు తరలింపు..

Update: 2020-02-08 03:14 GMT

కరోనావైరస్ వ్యాప్తి కేంద్రంగా ఉన్న వుహాన్ లో అమెరికన్లను తీసుకెళ్లేందుకు అమెరికా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం రెండు విమానాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చైనా నగరం నుండి సుమారు 300 మంది అమెరికన్లను తీసుకెళ్లిన ఈ రెండు విమానాలు శుక్రవారం కాలిఫోర్నియా మరియు టెక్సాస్‌లోని సైనిక స్థావరాల వద్దకు చేరుకున్నాయి. ఈ సందర్బంగా అమెరికా ఆరోగ్య మరియు మానవ సేవల కార్యదర్శి అలెక్స్ అజార్ మాట్లాడుతూ.. వైరస్ వ్యాప్తి నుండి రక్షించడానికి అమెరికా ప్రయాణీకులు 14 రోజుల నిర్బంధంలో ఉంటారు. "మా మొదటి ప్రాధాన్యత అమెరికా ప్రజలను రక్షించడానికే.. ఇందుకోసం అన్ని రంగాల్లో కృషి చేస్తున్నాము" అని విలేకరులతో అన్నారు. 300 మందిని రక్షించేందుకు ఏర్పాటు చేసిన రెండు విమానాల్లో 50 మంది దాకా వైద్య సిబ్బంది ఉన్నారు. ఒక్కో విమానంలో 300 మందిని తీసుకురావచ్చు కానీ 150 మందిని మాత్రమే అనుమతించారు. ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకుంది అమెరికా ప్రభుత్వం.

ఇక శుక్రవారం ఉదయం నాటికి, U.S. లో 12 వైరస్ కేసులు నమోదయ్యాయి. క్రూయిజ్ షిప్ లో చిక్కుకున్న 61 మందిలో 11 మంది అమెరికన్లు ఉన్నారు. వీరి గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అమెరికా ఆరాతీస్తోంది. ఇదిలావుంటే కరోనా వైరస్ భారిన పడి ఇప్పటివరకు 724 మంది మరణించినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వాటిలో రెండు మినహా మిగిలినవి అన్ని చైనాలో సంభవించాయి. ఒక వ్యక్తి ఫిలిప్పీన్స్ లో మరొకరు హాంకాంగ్ లో మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 34,000 మందికి పైగా వైరస్ బారిన పడ్డారు, వీరిలో ఎక్కువ మంది చైనాలో ఉన్నారు. కాగా గతేడాది డిసెంబర్ 30 న చైనా వైద్యుడు లీ వెన్లియాంగ్ కరోనావైరస్ పై తోటి వైద్యులను హెచ్చరించాడు. దీనిపై హెచ్చరిస్తూ సోషల్ నెట్‌వర్క్‌లో SMS లు పంపారు. అయితే అతని హెచ్చరికను అప్పుడు ఎవరూ నమ్మలేదు. అంతేకాకుండా, తప్పుడు వార్తలను వ్యాప్తి చేశారని.. చైనా పోలీసులు అతనికి సమన్లు ​​పంపడమే కాకుండా అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అతను కూడా కొరోనావైరస్ బారిన పడి మరణించారు.

Tags:    

Similar News