పాకిస్తాన్ మాజీ ప్రధానిపై అత్యాచారం ఆరోపణలు

పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న సింథియా డి రిట్చీ అనే అమెరికన్ బ్లాగర్.. మాజీ హోంమంత్రి రెహమాన్ మాలిక్ తనపై అత్యాచారం చేశాడని ఆరోపించారు.

Update: 2020-06-06 06:41 GMT

పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న సింథియా డి రిట్చీ అనే అమెరికన్ బ్లాగర్.. మాజీ హోంమంత్రి రెహమాన్ మాలిక్ తనపై అత్యాచారం చేశాడని ఆరోపించారు.అలాగే మాజీ ప్రధాని యూసుఫ్ రాజా గిలానీ కూడా శారీరక హింసకు పాల్పడినట్లు రిచీ ఆరోపించారు. ఆ సమయంలో మత్తు పదార్థాలను కలిపిన పానీయం ఇచ్చారని దాంతో తాను మత్తులో ఉన్నానని పేర్కొన్నారు. కాగా ఇందుకు సంబంధించి శుక్రవారం ఫేస్‌బుక్‌లో ఒక వీడియోను విడుదల చేసింది. ఇందులో రెహమాన్ మాలిక్ , గిలానీపై ఆరోపణలు చేసింది.

2011 లో ఆమె రాష్ట్రపతి భవన్ లో నివసించినప్పుడు ఈ సంఘటన జరిగిందని అన్నారు. ఈ సమయంలో బెనజీర్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) అధికారంలో ఉంది. ప్రస్తుతం, ఆ పార్టీకి బెనజీర్ కుమారుడు బిలవర్ భుట్టో జర్దారీ నాయకత్వం వహిస్తున్నారు. మరోవైపు రిచీ ఇప్పుడు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ యొక్క సోషల్ మీడియా బృందంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

Tags:    

Similar News