Coronavirus : మరింత ఆందోళనకరంగా అమెరికాలో పరిస్థితి.. గత 24 గంటల్లో

అమెరికాలో కరోనావైరస్ కారణంగా పరిస్థితి మరింత మారుతోంది. గత 24 గంటల్లో 518 మంది మరణించారు.

Update: 2020-03-30 05:58 GMT

అమెరికాలో కరోనావైరస్ కారణంగా పరిస్థితి మరింత మారుతోంది. గత 24 గంటల్లో 518 మంది మరణించారు. రాబోయే రెండు వారాల్లో మరణాల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో చెప్పారు. ఏప్రిల్ 12 ఈస్టర్ నాటికి అమెరికాలో మరణాల సంఖ్య గరిష్టంగా ఉంటుంది అందువల్ల ప్రజలు మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సామాజిక దూరం పాటించే తేదీని కూడా ఏప్రిల్ 30 వరకు పొడిగించిన ట్రంప్.. ప్రస్తుతం సామాజిక దూరం అనేది చాలా ముఖ్యమైనది, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలి, జూన్ నాటికి కోలుకోవాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

మరోవైపు కరోనా నివారణ కోసం ప్రభుత్వ ప్రణాళికలు - వ్యూహాన్ని ట్రంప్ వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మంగళవారం కొన్ని ముఖ్యమైన ప్రకటనలు చేయవచ్చని అగ్రరాజ్య మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా ఆ దేశంలో 2 లక్షల మందికి వ్యాధి సోకినట్లు వైట్ హౌస్ అంచనా వేసింది. ఆర్ధికంగా వెసులుబాటు కల్పించే విధంగా ఏమైనా ప్రకటన ఉంటుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇక అమెరికాలో 1 లక్ష 42 వేల కరోనా కేసులు అధికారికంగా నమోదయ్యాయి, 2400 కు పైగా మరణాలు సంభవించాయి.

ఇదిలావుంటే శుక్రవారం అలస్కాలో 85 కేసులు నమోదయ్యాయి.. అంతేకాదు ఇక్కడ కరోనా నుండి మొదటి మరణం సంభవించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అలస్కా రాష్ట్రంలో 7.37 లక్షల జనాభాలో 40 నుండి 70% జనాభా వరకు కరోనావైరస్ ద్వారా ప్రభావితమవుతారని వైట్ హౌస్అంచనా వేస్తోంది. ప్రాథమిక నివేదిక ఆధారంగా, జనాభాలో 20% అంటే 59 వేల మందికి వైద్య సదుపాయాలు అవసరమవుతాయి. అలాస్కాలో 1500 పడకల జనరల్ హాస్పిటల్ ఉంది. కొన్నిచోట్ల కొత్త మెడికల్ సెటప్ సిద్ధం చేయడానికి ఇతర ప్రదేశాల కంటే ఎక్కువ సమయం పడుతుందని వైట్ హౌస్ అధికారులు అంచనా వేస్తున్నారు.


Tags:    

Similar News