నేను మాస్కు వేసుకోను : ట్రంప్

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కబళిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 10లక్షల మందికిపైగా వైరస్‌ వ్యాపించిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O)కూడా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.

Update: 2020-04-04 08:02 GMT
Donald Trump (File Photo)

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కబళిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 10లక్షల మందికిపైగా వైరస్‌ వ్యాపించిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O)కూడా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. ఈ మహమ్మారిని కట్టడిచేసేందుకు యావత్‌ ప్రపంచం ప్రయత్నిస్తోంది. ప్రపంచంలోని సంగంపైగా దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. చైనా తర్వాత అమెరికాలో ఈ మహమ్మారి తీవ్రత అధికంగా ఉంది. అమెరకాలో 7 వేల మంది దీని బారినపడి మరణించారు. లక్షల మందికి ఈ వైరస్ సోకింది.

ఈ సందర్భంలో కరోనా వ్యాప్తిని నియంత్రణకు దేశంలోని ప్రజలందరూ మాస్కులు ధరించాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సూచించారు. అయితే, కోసం మెడికల్‌ మాస్కులు కాకుండా ఇంట్లో తయారుచేసిన మాస్కులు, సాధారణ మాస్కులు, చేతి రుమాళ్లు, ధరిస్తే సరిపోతుందన్నారు. ఇదే విషయాన్ని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌(సీడీసీ) సిఫార్సు చేసిందని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రజలు దీన్ని స్వచ్ఛందంగా పాటించాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. అయితే తాను మాత్రం మాస్కు వేసుకోనని ట్రంప్‌ స్పష్టంగా పేర్కొనడం గమనార్హం.

తాజాగా గాలి ద్వారా కూడా వైరస్‌ వ్యాపిస్తుందనే అనుమానాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. అమెరికా శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ తీవ్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం కరోనా సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉండడం వల్లే వ్యాపిస్తుందని నిపుణలు పేర్కొంటున్నారు. ఇదే విషయంపై అయితే దీనిపై పరిశోధనలు జరగుతున్నాయని వెల్లడించారు. ముందుజాగ్రత్త చర్యగా ముఖానికి మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.




Tags:    

Similar News