America: నల్లజాతీయులకు గిఫ్ట్ : తొలిసారిగా ఎయిర్ చీఫ్ గా ఎంపిక

జాతివివక్షపై నిరసనలతో రగిలిపోతున్న అగ్రరాజ్యం అమెరికాలో ఓ నల్ల జాతీయుడికి అగ్ర తాంబులం ఇచ్చింది.

Update: 2020-06-11 03:20 GMT
General Charles Brown Junior appointed as Air Force Chief

జాతివివక్షపై నిరసనలతో రగిలిపోతున్న అగ్రరాజ్యం అమెరికాలో ఓ నల్ల జాతీయుడికి అగ్ర తాంబులం ఇచ్చింది. దేశంలో విపక్ష లేదని నిరూపించుకునేందుకు ప్రయత్నించింది. తాజాగా అమెరికా వాయుసేన చీఫ్‌గా తొలిసారి ఓ నల్లజాతీయుడిని నియమించింది. జనరల్ చార్లెస్ బ్రౌన్ జూనియర్‌ను ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా నియమించాలన్న ప్రతిపాదనకు యూఎస్ సెనేట్ సంపూర్ణ మద్దతు తెలిపింది. అమెరికా చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి నల్లజాతీయుడిగా చార్లెస్ రికార్డు సృష్టించాడు. చార్లెస్ గతంలో యూఎస్ పసిఫిక్ ఎయిర్‌ఫోర్సెస్ కమాండర్‌గా పనిచేశాడు.

జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో అమెరికా అల్లాడుతున్న సమయంలోనే ఈ నియామకం చేపటడం విశేషం. దీంతో కొద్ది రోజులుగా అమెరికాలో జరుగుతున్న అల్లర్లు కొంత వరకు శాంతిస్తాయని శ్వేత సౌధం భావిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో దానికి తగ్గట్టు ప్రణాళికలు చేస్తోంది అమెరికా ప్రభుత్వం. ఇటీవల నల్లజాతీయుని మరణంతో వచ్చిన వ్యతిరేకతను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసిందని పరిశీలకుల అంచనా. అయితే ఏది ఎలాగున్నా అమెరికా చరిత్రలో ఈ ఘనత సాధించిన వ్యక్తుల్లో చార్లెస్ ఒకరుగా చెప్పుకుంటున్నారు.


Tags:    

Similar News