హెచ్‌1బీ వీసాదారులకు భారీ ఉపశమనం

అమెరికాలో శాశ్వత నివాసం కోసం హెచ్‌1బీ వీసా, గ్రీన్‌కార్డు అవసరం అన్న సంగతి తెలిసిందే. అయితే కొంతకాలంగా వీటిపై ట్రంప్ సర్కార్ పలు ఆంక్షలు విధించింది.

Update: 2020-05-03 02:26 GMT

అమెరికాలో శాశ్వత నివాసం కోసం హెచ్‌1బీ వీసా, గ్రీన్‌కార్డు అవసరం అన్న సంగతి తెలిసిందే. అయితే కొంతకాలంగా వీటిపై ట్రంప్ సర్కార్ పలు ఆంక్షలు విధించింది.కొత్తగా హెచ్‌1బీ వీసా కోసం పలు పత్రాలు ఇవ్వాలని అమెరికా కండిషన్ పెట్టింది. దాంతో భారత్‌ సహా వివిధ దేశాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వారికి కష్టాలు మొదలయ్యాయి. అయితే ఈ క్రమంలో సర్కార్ భారీ ఊరటనిచ్చింది. పలు కారణాలతో ఇప్పటికే నోటీసులు అందుకున్న హెచ్‌1బీ వీసాదారులు, గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు అవసరమైన పత్రాలను సమర్పించడానికి గడువు ఇచ్చింది.

వీసా పొడిగింపు విజ్ఞప్తులు, ఉపసంహరణ నోటీసులు తిరస్కరణ నోటీసులు, ప్రాంతీయ పెట్టుబడుల ఉపసంహరణ, ముగింపు నోటీసులు, ఫారమ్‌ ఐ–290బీ, దరఖాస్తు నోటీసులు వంటి వాటిపై అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించడానికి గడువు 60 రోజులు ఇచ్చింది.దరఖాస్తుదారులు తమ పత్రాలను ఈ 60 రోజుల్లో ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చని ట్రంప్ సర్కార్ స్పష్టం చేసింది. దాంతో దరఖాస్తుదారులకు భారీ ఉపశమనం కలిగినట్టయింది. గడువును మరో 60 రోజులు పెంచినట్టుగా యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) పేర్కొంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

Tags:    

Similar News