W.H.O ప్రకటన : ఒక్క రోజులోనే 14 వేల కరోనా వైరస్ కేసులు

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

Update: 2020-03-17 17:13 GMT
WHO(File Photo)

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గత 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 14 వేల కరోనా వైరస్ కొత్త కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ..W.H.O అధికారికంగా ప్రకటించింది.గత 24 గంటల్లో 862 మంది చనిపోయారని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనతో సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చాపకింద నీరులా ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. చైనాలో వెలుగు చూసిన కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ప్రస్తుతం 160కు పైగా దేశాలకు కరోనా విస్తరించింది. లక్షల మంది కరోనా బారిన పడ్డారు. వేల మంది చనిపోయారు. వందలాది మంది పరిస్థితి విషమంగా ఉంది.

కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా వ్యాప్తి విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయమై .W.H.O కీలక ప్రకటన చేసింది. గత 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 14 వేల కరోనా వైరస్ కొత్త కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య 1,67,500కి పెరిగిందని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 6,606కు పెరిగిందని గత 24 గంటల్లో 862 మంది చనిపోయారని తెలిపింది. ఇండియాతో పాటు 130 దేశాలకు ఈ వైరస్ పాకిందని వెల్లడించింది.

చైనాను వీడి..యూరప్ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ వేలాది మంది మరణాలకు కారణమౌతోంది. ఈ పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి అనుమానిత వ్యక్తికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరింది. దీనికి మించిన మార్గం మరొకటి లేదని సంస్థ చీఫ్ టెడ్రోస్ అభిప్రాయపడ్డారు. వైద్య పరీక్షల నిర్వహణ ప్రక్రియను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ, WHO, coronavirus cases, Death

Tags:    

Similar News