Cargo Flight: విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే ఊడిన టైర్
Cargo Flight: వంద కేజీలకు పైగా బరువుండే విమానం టైర్
Cargo Flight: ఇటలీ విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే ఊడిన టైర్
Cargo Flight: ఇటలీలో వింత సంఘటన చోటు చేసుకుంది.. విమానం గాల్లోకి లేచిన కొద్ది సేపటికే టైర్ ఊడిపోతే దాని పరిస్థితి ఏంటి..? టైర్ ఎవరిమీదైనా పడితే ఏం జరుగుతుంది..? ఊహించుకోవడానికే భయంగా ఉంది కదా.. ఇటలీలో సరిగ్గా అదే జరిగింది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే వంద కేజీలకు పైగా బరువుండే విమానం టైర్ ఊడి పోయింది.
ఇటలీలోని టొరొంటోలో జరిగిందీ ఘటన.. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమైన బోయింగ్ 747-400 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే టైరు ఊడి కిందపడింది. విమానం చార్లెస్టన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సేఫ్‌గా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానం టైర్ ఊడిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.