ప్రపంచాన్ని భయపెడుతున్న కొత్త వైరస్‌లు.. అమెరికా, చైనాలలో మంకీ వైరస్ కలకలం

Monkey B Virus: కోవిడ్ నుంచి గట్టెక్కకముందే ప్రపంచ దేశాలను మరో డేంజర్ వైరస్ భయపెడుతోంది.

Update: 2021-07-17 13:49 GMT

ప్రపంచాన్ని భయపెడుతున్న కొత్త వైరస్‌లు

Monkey B Virus: కోవిడ్ నుంచి గట్టెక్కకముందే ప్రపంచ దేశాలను మరో డేంజర్ వైరస్ భయపెడుతోంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అత్యంత అరుదైన మంకీ పాక్స్ వెలుగు చూసింది. కొద్దిరోజుల క్రితం నైజీరియా నుంచి తిరిగొచ్చిన టెక్సాస్ వ్యక్తిలో ఈ వైరస్ బయటపడింది. ప్రస్తుతం అతడిని అమెరికా డెల్లాస్‌లోని ఓ ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. మరోవైపు అతని కాంటాక్ట్స్‌ను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అతనితో పాటు విమాన ప్రయాణం చేసినవారిని, ఇటీవల అతన్ని కలిసినవారిని గుర్తించనున్నారు.

మరోవైపు వూహాన్ ల్యాబ్‌లోనే వైరస్ పుట్టిందన్న విమర్శల మధ్య చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది. 'మంకీ బి' పేరుతో వెలుగులోకొచ్చిన ఈ వైరస్ సోకి బీజింగ్‌కు చెందిన పశువైద్యుడు కన్నుమూశాడు. ఈ మంకీ బీవైరస్ సోకిన తొలి మానవ కేసుగా చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. అయితే అతనితో సన్నిహితంగా ఉన్న వారు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News