ఆయిల్‌పామ్ సాగుకు ఆసక్తి చూపుతున్న రైతులు

Oil Palm Cultivation: అత్యధిక నూనె ఉత్పత్తి చేయగల పంట ఆయిల్‌పామ్‌. ఏడాదికి హెక్టారుకు 18.5 టన్నుల వరకు నూనెను ఉత్పత్తి చేయగలదు.

Update: 2022-05-10 10:30 GMT

ఆయిల్‌పామ్ సాగుకు ఆసక్తి చూపుతున్న రైతులు

Oil Palm Cultivation: అత్యధిక నూనె ఉత్పత్తి చేయగల పంట ఆయిల్‌పామ్‌. ఏడాదికి హెక్టారుకు 18.5 టన్నుల వరకు నూనెను ఉత్పత్తి చేయగలదు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ అవసరాలను తీర్చడానికి సుమారు 25 మిలియన్ టన్నుల వంటనూనె అవసరం. కానీ మన ఉత్పత్తి స్థాయి సగటున 9-10 మిలియన్ టన్నులు మాత్రమే. పెరుగుతున్న కొనుగోలు శక్తితో వంటనూనెలకు గిరాకీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయిల్‌పామ్ సాగుకు ఈ మధ్యన రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. భారతదేశంలో నీటిపారుదల కింద అధిక దిగుబడులను అందిస్తోంది ఆయిల్‌పామ్ పంట. ఏడాది పొడవునా పుష్ఫగుచ్చాలను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల ఈ పంటకు నీరు, పోషకాలను నిరంతరం అందించాలి. నీటి పారుదల అనేది ఆయిల్‌పామ్‌ పంటకు అత్యంత కీలకమైంది.

పంట వయసు, నేల రకంపై ఆధారపడి నీటిని అందించాలి. సాధారణంగా ఏడాదికి నీటి సరఫరాలో 100 మిల్లీమీటర్ల లోటు ఉంటే 10 శాతం దిగుబడి నష్టపోవాల్సి వస్తుంది. ఇది నేల రకం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆయిల్‌పామ్ ప్రతి రెండు వారాలకు ఒక కొత్త ఆకును ఉత్పత్తి చేస్తుంది. రెండేళ్లలో ఇది పూర్తి ఆకుగా అభివృద్ధి చెందుతుంది. నీటి ఒత్తిడి ఉంటే పత్రాలు విప్పారడం ఆలస్యమవుతుంది. ఆయిల్‌పామ్‌లో మగ, ఆడ పుష్పగుచ్ఛాలు ఒకే మొక్కపై అభివృద్ధి చెందుతాయి. పండ్ల గుచ్ఛాల దిగుబడి గెల సంఖ్య, గెల బరువుపై ఆధారపడి ఉంటుంది. కోత దశలోని చెట్లలో ముందుగా గెల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పరిపక్వ దశలో తగ్గుతుంది. ఉత్పత్తి చేసిన ఆకుల సంఖ్య లింగ నిష్పత్తి, పుష్పగుచ్ఛపు గర్భవిచ్ఛిత్తి, ఫల గుచ్ఛాల వైఫల్యంపై ఆధారపడి ఉంటుంది.

లేత దశలోని పామాయిల్ మొక్కల్లో నెలకు ఎక్కువ ఆకులు ఉత్పత్తవుతాయి. పరిపక్వత వచ్చినప్పుడు నెలకు రెండు ఆకులను మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. ప్రతి ఆకు ఒక పుష్ప గుచ్ఛాన్ని ఇస్తుంది. ఎక్కువ ఆకులు ఉంటే ఎక్కు పుష్పగుచ్ఛాలు ఉంటాయి. స్త్రీ పుష్పగుచ్ఛాల సంఖ్యను మొత్తం పుష్పగుచ్ఛాల సంఖ్యకు గల నిష్పత్తిని లింగ నిష్పత్తి అటారు. ఇది నీరు, పోషకాల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. లింగభేదం చెందే దశలో ఏర్పడే కరవు లేదా నీటి ఎద్దడి పరిస్థితులు, పంటకు 24 నుంచి 25 నెలల ముందు, లిగ నిష్పత్తిని ప్రభావితం చేస్తాయి. లింగ నిష్పత్తి జన్యు, పర్యావరణ కారకాల చేత ప్రభావితమవుతుంది. తగినంత నీరు లేదా పోషకాలు లభించకపోవడం వల్ల అభివృద్ధి చెందుతున్న పుష్పగుచ్ఛాలలో ఆకసక్మిక గర్భవిచ్చిత్తి జరుగుతుంది. ఇది పుష్ప వికాసానికి సుమారు 4 నుంచి 6 నెలల ముందు జరుగుతుంది.

పంటకోత సమయానికి ఒకటి నుంచి 3 నెలల ముందు నీటి ఒత్తిడి వల్ల పుష్పగుచ్ఛాల విచ్ఛిత్తి జరిగి దిగుబడి తగ్గుతుంది. మలేషియాలో ఆయిల్‌పామ్‌ నూనె దిగుబడిలో 12 నుంచి 24 శాతం తగ్గుదల వర్షపాతం లోటు వల్లనే అని నిరూపితమైంది. ఒక ఆయిల్‌పామ్ చెట్టుకు రోజుకు 140 నుంచి 280 లీటర్ల నీరు అవసరం. సీజన్‌, చెట్టు , నేల రకాన్ని బట్టి ఇది మారుతుంది. నీటి అవసరాన్ని పెంచకుండా పండ్ల గుచ్ఛాల దిగుబడి స్థాయిలను పెంచడం ద్వారా ఖచ్చితంగా నీటి ఉత్పాదకతను పెంచడం సాధ్యమవుతుంది.

Full View


Tags:    

Similar News