Bamboo Farming: ఎకరాకు రూ. 20 వేల పెట్టుబడి.. ఏడాదికి రూ. 2 లక్షల రాబడి!

Agriculture : సాధారణంగా రైతులు వరి, పత్తి వంటి సంప్రదాయ పంటల సాగుతో పెట్టుబడి రాక, గిట్టుబాటు ధర లేక సతమతమవుతుంటారు.

Update: 2026-02-19 14:52 GMT

Bamboo Farming: ఎకరాకు రూ. 20 వేల పెట్టుబడి.. ఏడాదికి రూ. 2 లక్షల రాబడి!

Agriculture : సాధారణంగా రైతులు వరి, పత్తి వంటి సంప్రదాయ పంటల సాగుతో పెట్టుబడి రాక, గిట్టుబాటు ధర లేక సతమతమవుతుంటారు. కానీ, ఇప్పుడు కాలం మారింది. మార్కెట్‌లో దేనికి డిమాండ్ ఉందో తెలుసుకుని అడుగువేస్తే, తక్కువ కష్టంతోనే కోట్లు సంపాదించవచ్చని ఉద్యానవన శాఖ నిరూపిస్తోంది. ప్రస్తుతం 'వెదురు సాగు' అచ్చం బంగారం పండించినట్టేనని నిపుణులు చెబుతున్నారు.

ఇన్నాళ్లూ వెదురును కేవలం గృహోపకరణాలు, కాగితం పరిశ్రమలకే పరిమితం అనుకునేవాళ్లం. కానీ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక సంచలన నిర్ణయం వెదురు దశను మార్చేసింది. దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించేందుకు, బొగ్గుతో పాటు వెదురు గుళికలను తప్పనిసరిగా వాడాలని కేంద్రం ఆదేశించింది.బొగ్గును కాల్చే సమయంలో కనీసం 7 శాతం వెదురు గుళికలను కలపడం వల్ల పర్యావరణ కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. ఈ ఒక్క నిర్ణయంతో వెదురుకు మార్కెట్‌లో మునుపెన్నడూ లేని విధంగా డిమాండ్ ఏర్పడింది.

వెదురు సాగులో విశేషం ఏమిటంటే, దీనికి ఇతర పంటల్లాగా ఎక్కువ ఎరువులు, పురుగుమందులు లేదా నిరంతర సంరక్షణ అవసరం లేదు.ఒక ఎకరం విస్తీర్ణంలో వెదురు సాగు చేయడానికి కేవలం రూ. 20,000 మాత్రమే ఖర్చవుతుంది.మొక్క నాటిన ఏడాది కాలంలోనే అది ఏపుగా పెరిగి కోతకు వస్తుంది.మార్కెట్ ధరలను బట్టి ఎకరాకు రూ. 1 లక్ష నుండి రూ. 2 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది.

వెదురు సాగు చేసే రైతులకు మార్కెటింగ్ భయం అక్కర్లేదు. ఉదాహరణకు, ఒడిశాలోని జిందాల్ ఇండియా థర్మల్ పవర్ కంపెనీ తన కొత్త ప్లాంట్ల కోసం ఏకంగా 26 వేల టన్నుల వెదురు గుళికల కోసం టెండర్లు పిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న వందలాది థర్మల్ ప్లాంట్లకు భవిష్యత్తులో లక్షల టన్నుల వెదురు అవసరం కానుంది.

ఎప్పుడూ వేసే పంటలే కాకుండా, వాణిజ్య పరంగా లాభసాటిగా ఉండే వెదురు సాగు వైపు రైతులు దృష్టి సారించాల్సిన సమయం ఇది. తక్కువ నీటి సౌకర్యం ఉన్న భూముల్లో కూడా ఇది అద్భుతంగా పెరుగుతుంది. పర్యావరణాన్ని కాపాడుతూనే, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వెదురు సాగు ఒక గొప్ప వరం.

Tags:    

Similar News