ఖరీదైన అవకాడోలను మన ఇంట్లోనే ఎలా పండించుకోవాలి

మార్కెట్‌లో ఖరీదైన అవకాడో పండును మీ ఇంటి మిద్దె తోటలో ఎలా పెంచుకోవాలి? విత్తనం నుంచి ఫలదీకరణ వరకు పూర్తి మార్గదర్శకం.

Update: 2026-02-12 11:11 GMT

ఖరీదైన అవకాడోలను మన ఇంట్లోనే ఎలా పండించుకోవాలి

సాధారణంగా రబీ సీజన్ ముగియగానే చాలామంది రైతులు పొలానికి కాస్త విశ్రాంతి ఇస్తారు. ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు కోతకు వచ్చాక.. మళ్ళీ మిర్చి లేదా టమోటా వంటి తదుపరి ప్రధాన పంటలు వేయడానికి మధ్యలో సుమారు 40 నుండి 60 రోజుల సమయం ఉంటుంది. ఈ ఖాళీ సమయాన్ని 'డెడ్ టైమ్'గా భావించకుండా, కాస్త తెలివిగా ప్లాన్ చేస్తే వేలల్లో అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

తక్కువ పెట్టుబడి.. తక్కువ కాలం

ఉల్లి, ఆలు సాగు తర్వాత ఖాళీ అయిన పొలాన్ని వెంటనే చదును చేసి పాలకూర, మెంతికూర, తోటకూర లేదా బచ్చలి కూర వంటి ఆకుకూరలను సాగు చేయడం ఉత్తమం.విత్తనాలు వేసిన కేవలం 20 నుండి 25 రోజుల్లోనే మొదటి కోతకు వస్తాయి.ఎకరం విస్తీర్ణంలో సాగు చేయడానికి విత్తనాలు, ఎరువులు అన్నీ కలిపి కేవలం 5 నుండి 8 వేల రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది.వేసవిలో ఆకుకూరలకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. తద్వారా నెలకు 30 వేల నుండి 40 వేల రూపాయల వరకు లాభం పొందే అవకాశం ఉంటుంది.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు

మీరు పొలాన్ని నిరంతరం సాగులో ఉంచాలనుకుంటే ఒక అద్భుతమైన మార్గం ఉంది. ఆకుకూరలు పెరుగుతున్న సమయంలోనే పొలంలో ఒక వైపున మీకు కావలసిన టమోటా లేదా మిర్చి నారును పోసుకోవాలి.ఆకుకూరల కోత పూర్తి కాగానే, భూమిని మళ్ళీ సిద్ధం చేసి, అప్పటికే ఎదిగిన నారును వెంటనే నాటుకోవచ్చు. దీనివల్ల సమయం వృధా కాదు. నారు నాటిన నెల రోజులకే పూత, కాపు ప్రారంభమవుతుంది.

ఎందుకు ఆకుకూరలే వేయాలి?

వేసవి కాలం ప్రారంభంలో నీటి లభ్యత తక్కువగా ఉన్నా, తక్కువ నీటితో ఆకుకూరలను పండించవచ్చు. మార్కెట్‌లో తాజా ఆకుకూరలకు ఉండే గిరాకీ రైతుకు క్యాష్ ఇన్ హ్యాండ్ అందిస్తుంది. ఇది తదుపరి ప్రధాన పంటకు అవసరమయ్యే పెట్టుబడి ఖర్చులను కూడా భర్తీ చేస్తుంది.

వ్యవసాయం అంటే కేవలం కష్టపడటమే కాదు, కాలాన్ని బట్టి ఆదాయాన్ని మలుచుకోవడంలోనే రైతు గొప్పతనం ఉంది. నెల రోజులు పొలాన్ని బీడుగా ఉంచడం కంటే, ఆకుకూరలతో పచ్చదనంతో పాటు జేబు నిండా డబ్బును సంపాదించుకోవడమే ఉత్తమ మార్గం.

Tags:    

Similar News