Part Time Jobs: ఉద్యోగం చేస్తూ అదనంగా సంపాదించవచ్చు.. ఈ పార్ట్‌ టైమ్‌ జాబ్స్‌ బెస్ట్‌..!

Part Time Jobs: ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగాలు చేస్తూ చాలి చాలని జీతాలతో కాలం వెళ్లదీస్తున్నారు.

Update: 2023-09-08 15:00 GMT

Part Time Jobs: ఉద్యోగం చేస్తూ అదనంగా సంపాదించవచ్చు.. ఈ పార్ట్‌ టైమ్‌ జాబ్స్‌ బెస్ట్‌..!

Part Time Jobs: ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగాలు చేస్తూ చాలి చాలని జీతాలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి వారు అదనపు సంపాదన కోసం తరచూ వెతుకుతుంటారు. వీరితో పాటు నిరుద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అవుతూ ఖర్చుల కోసం చిన్న చిన్న పనులు చేయాలని అనుకుంటారు. అయితే సమయం ఉన్నప్పటికీ కొంతమందికి ఏం పనిచేయాలో తెలియదు. ఇలాంటి వారికోసం కొన్ని రకాల పార్ట్‌ టైం జాబ్స్‌ గురించి తెలుసుకుందాం.

ట్యూటరింగ్

సౌకర్యవంతంగా ఉన్న పాఠశాల లేదా కళాశాల విద్యార్థులకు ట్యూషన్ చెప్పవచ్చు. తద్వారా మీ ఖర్చుల అవసరం నిమిత్తం సంపాదించుకోవచ్చు.

కంటెంట్ రైటింగ్

మంచి రైటింగ్‌ స్కిల్స్‌ ఉంటే బ్లాగులు, వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియాలో ఫ్రీలాన్స్ రైటర్‌గా పని చేయవచ్చు. దీనివల్ల ఆదాయం వస్తుంది.

ఫ్రీలాన్సింగ్

నైపుణ్యాన్ని బట్టి గ్రాఫిక్ డిజైన్, ప్రోగ్రామింగ్, వెబ్ డెవలప్‌మెంట్ లేదా డిజిటల్ మార్కెటింగ్ వంటి రంగాల్లో ఫ్రీలాన్సర్‌గా చేయవచ్చు.

డేటా ఎంట్రీ

డేటా ఎంట్రీ పని చాలా సులభం. పార్ట్ టైమ్‌గా చేసి మంచి ఆదాయం సంపాదించవచ్చు. ఖాళీగా ఉన్నవారందరు ఈ పనిచేయవచ్చు.

ఫోటోగ్రఫీ

మీ ఫోటోగ్రఫీ బాగుంటే పార్ట్ టైమ్ ఫొటోగ్రాఫర్‌గా పని చేయవచ్చు. ఫోటోలు, వీడియోలను ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో విక్రయించవచ్చు.

లాంగ్వేజ్ ట్యూటరింగ్

మీకు భాషలపై పట్టు ఉంటే భాషా తరగతులను చెప్పవచ్చు. క్లాస్ ప్రకారం ఛార్జింగ్ పెట్టి పార్ట్ టైమ్‌గా బాగా సంపాదించుకోవచ్చు.

రిటైల్ స్టోర్‌లో పని చేయడం

వారాంతం లేదా సాయంత్రాల్లో రిటైల్ స్టోర్‌లో పని చేయడం వల్ల ఎంతో కొంత అదనపు ఆదాయాన్ని సంపాదించవచ్చు. దీనికి చదువు కూడా అవసరం లేదు.

డెలివరీ డ్రైవర్లు

ఫుడ్ డెలివరీ సేవలు లేదా కొరియర్ కంపెనీలకు పార్ట్ టైమ్ డెలివరీ డ్రైవర్లుగా పని చేయవచ్చు. ఇందులో డెలివరీని బట్టి ఆదాయం వస్తుంది. మీ సౌలభ్యం ప్రకారం పనిచేయవచ్చు.

కాల్ సెంటర్ ప్రతినిధిగా

చాలా కంపెనీలు కస్టమర్ సర్వీస్ లేదా టెక్నికల్ సపోర్ట్ రోల్స్ కోసం పార్ట్ టైమ్ పోస్ట్‌లను అందిస్తాయి. ఇలా కాల్‌సెంటర్‌ ప్రతినిధిగా పనిచేస్తూ సంపాదించవచ్చు.

Tags:    

Similar News