Groups Jobs: గ్రూప్‌ 2లో అత్యధిక పోస్టులు ఈ 4 శాఖల నుంచే..!

Groups Jobs: తెలంగాణలో నిరుద్యోగులకి మంచి రోజులు వచ్చాయి.

Update: 2022-08-31 13:30 GMT

Groups Jobs: గ్రూప్‌ 2లో అత్యధిక పోస్టులు ఈ 4 శాఖల నుంచే..!

Groups Jobs: తెలంగాణలో నిరుద్యోగులకి మంచి రోజులు వచ్చాయి. సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించినప్పటినుంచి వరుసగా జాబ్‌ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే గ్రూప్‌ 1, పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఎస్సైలు, కానిస్టేబుల్‌, ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌, సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్స్‌ వంటి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. తాజాగా నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గ్రూప్‌ 2, 3 పోస్టులకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీంతో త్వరలో నోటిఫికేషన్లు విడుదలకానున్నాయి. అయితే ఇందులో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయో తెలుసుకుందాం.

గ్రూప్‌ 2 పోస్టులు 663 ఉండగా, గ్రూప్‌ 3 పోస్టులు 1,373 వరకు ఉన్నాయి. ఈ పోస్టులన్నింటిని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) ద్వారా భర్తీ చేస్తారు. తాజా ఉత్తర్వుల ప్రకారం గ్రూప్ 2 ఉద్యోగాల్లో జీఏడీ ఏఎస్‌వో పోస్టులు-165, పంచాయతీరాజ్ ఎంపీవో పోస్టులు-125, డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు- 98, ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులు- 97, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టులు- 59 ఉన్నాయి. చేనేత ఏడీవో పోస్టులు- 38, ఆర్థికశాఖ ఏఎస్‌వో పోస్టులు- 25, అసెంబ్లీ ఏఎస్‌వో పోస్టులు-15, గ్రేడ్ 2 సబ్ రిజిస్ట్రార్ పోస్టులు-14, గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్ పోస్టులు-11, ఏఎల్‌వో పోస్టులు-9, న్యాయశాఖ ఏఎస్‌వో పోస్టులు-6 ఉన్నాయి.

అయితే ఇందులో అత్యధికంగా జీఏడీ ఏఎస్‌వో పోస్టులు-165, పంచాయతీరాజ్ ఎంపీవో పోస్టులు-125, డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు- 98, ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులు- 97 ఉన్నాయి. వీటికి పోటీ అధిక స్థాయిలో ఉండనుంది. గ్రూప్ -3 ఉద్యోగాల్లో మొత్తం 99 విభాగాధిపతులు, కేటగిరీల పరిధిలో 1,373 జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి.

Tags:    

Similar News