TS EAMCET 2023: తెలంగాణలో ఎంసెట్ షెడ్యూల్ విడుదల
TS EAMCET 2023: తెలంగాణలో ఎంసెట్ షెడ్యూల్ విడుదలైంది.
TS EAMCET 2023: తెలంగాణలో ఎంసెట్ షెడ్యూల్ విడుదల
TS EAMCET 2023: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రకల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. ఈనెల 28న ఎంసెట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి వెల్లడించారు. మార్చి 3 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని.. మే 7 నుంచి 11 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది.