TREIRB Recruitment 2023: నిరుద్యోగులకు అలర్ట్.. గురుకులాల్లో 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..!
TS Gurukul Teacher Jobs 2023: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.
TREIRB Recruitment 2023: నిరుద్యోగులకు అలర్ట్.. గురుకులాల్లో 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..!
TS Gurukul Teacher Jobs 2023: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో మరో భారీ ఉద్యోగ నియామక నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ అవ్వగా.. తాజాగా గురుకులాల్లో 9 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ప్రకటన చేసింది. గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. డిగ్రీ కాలేజీల్లో 868 అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.
జూనియర్ కళాశాలల్లో 2008 లెక్చరర్లు, పాఠశాలల్లో 1276 పీజీటీ, 434 లైబ్రేరియన్, 275 ఫిజికల్ డైరెక్టర్, 134 ఆర్ట్స్, 92 క్రాఫ్ట్, 124 మ్యూజిక్, 4020 టీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఈనెల 12 నుంచి వన్ టైం రిజిస్ట్రేషన్.. 17 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ మల్లయ్యభట్టు తెలిపారు.