TS Intermediate: విద్యార్థులకు అలర్ట్.. వార్షిక సిలబస్‌పై బోర్డు కీలక నిర్ణయం..
TS Inter Academic Calendar: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
TS Intermediate: విద్యార్థులకు అలర్ట్.. వార్షిక సిలబస్‌పై బోర్డు కీలక నిర్ణయం..
TS Inter Academic Calendar: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం పూర్తి స్థాయి సిలబస్‌ను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు పాత విధానంలోనే ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లగా 70 శాతం సిలబస్‌తోనే సరిపెట్టింది బోర్డు. లాక్‌డౌన్ కారణంగా క్లాసులు ఎక్కువగా జరగనుందున విద్యార్థులు ఒత్తిడికి గురవ్వకుండా ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి మాత్రం కరోనా ముందు ఉన్నట్లుగానే ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ సిలబస్ ఉంటుందని స్పష్టం చేసింది.