TS Inter: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఆ ఒక్క సబ్జెక్ట్ సిలబస్ మారింది..
TS Inter Syllabus: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ముఖ్య గమనిక.
TS Inter: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఆ ఒక్క సబ్జెక్ట్ సిలబస్ మారింది..
TS Inter Syllabus: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ముఖ్య గమనిక. ఇంటర్ సెకండ్ ఇయర్ మొదటి లాంగ్వేజ్ ఇంగ్లిష్ సబ్జెక్టు సిలబస్‌లో మార్పులు చేసినట్లు ఇంటర్ బోర్డు అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు కొత్త ఇంగ్లీష్ పుస్తకాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ, ఇంటర్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. కొత్త సిలబస్‌తో ముద్రించిన పుస్తకాలు త్వరలో బహిరంగ మార్కెట్‌లో అందుబాటులోకి వస్తాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ వెల్లడించారు. ఇటీవల ఇంగ్లిష్ పరీక్షలో ఫెయిలైన విద్యార్థులకు పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని జలీల్ స్పష్టం చేశారు.