TS Inter Results 2023: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

TS Inter Results 2023: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి.

Update: 2023-05-09 05:43 GMT

TS Inter Results 2023: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

TS Inter Results 2023: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఒకేసారి ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షా ఫలితాలను మంత్రి సబితా విడుదల చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 5 వరకు నిర్వహించిన ఇంటర్‌ పరీక్షలకు మొత్తం 9.47 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫ‌స్టియ‌ర్ 4,33,082 మంది హాజ‌రైతే 2,72,208 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. ఫ‌స్టియ‌ర్‌లో 62.85 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. సెకండియ‌ర్‌లో 3,80,920 మంది హాజ‌రైతే 2,56,241 మంది ఉత్తీర్ణ‌త సాధించ‌గా, 67.27 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది.

ఇంట‌ర్ ఫ‌లితాల కోసం tsbie.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు. ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో 75. 27 శాతంలో మేడ్చల్‌ జిల్లా తొలి స్థానంలో నిలవగా, ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాల్లో 85.05 శాతంలో ములుగు జిల్లా అగ్రస్థానం సాధించింది. జూన్‌ 4వ తేదీ నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ ఎగ్జామ్స్‌ నిర్వహించనున్నట్లు మంత్రి సబిత తెలిపారు. అదే సమయంలో ఫెయిలైన విద్యార్థులు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దన్నారు మంత్రి.

Tags:    

Similar News