నిరుద్యోగులకి గుడ్‌న్యూస్‌.. టెక్‌ మహీంద్రా బంపర్ ఆఫర్..!

Tech Mahindra Jobs 2022: ఐటీ కంపెనీలు ఒకవైపు ఉద్యోగులని తీసివేస్తుంటే మరోవైపు టెక్‌ మహీంద్రా ఫ్రెషర్లకి అవకాశం కల్పిస్తోంది.

Update: 2022-11-04 03:42 GMT

నిరుద్యోగులకి గుడ్‌న్యూస్‌.. టెక్‌ మహీంద్రా బంపర్ ఆఫర్..!

Tech Mahindra Jobs 2022: ఐటీ కంపెనీలు ఒకవైపు ఉద్యోగులని తీసివేస్తుంటే మరోవైపు టెక్‌ మహీంద్రా ఫ్రెషర్లకి అవకాశం కల్పిస్తోంది. ఏడాదిలోపల దాదాపు 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రకటించింది. టెక్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CP గుర్నానీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి వివరాలని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "వచ్చే ఏడాదిలో దాదాపు 20,000 మంది ప్రెషర్స్‌కి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. కంపెనీలో ఇప్పుడు 1,64,000 ఉద్యోగులు ఉన్నారని వచ్చే పన్నెండు నెలల్లో 1,84,000 మందికి చేరుకుంటామని పేర్కొన్నారు.

మంగళవారం ప్రకటించిన త్రైమాసిక ఫలితాల ప్రకారం జూన్ త్రైమాసికంలో 6,862 మందిని నియమించగా సెప్టెంబర్ త్రైమాసికంలో 5,877 మందిని ఐటి సేవల కన్సల్టెన్సీ కంపెనీ నియమించుకుంది. గుర్నాని మాట్లాడుతూ.. " శ్రామిక శక్తిని పెంచాలని నిర్ణయించుకున్నాం. భవిష్యత్తు, స్కిల్ డెవలప్‌మెంట్, గ్లోబల్ డెలివరీ మోడల్‌పై దృష్టి పెడుతున్నాం. అన్ని కంపెనీలని ఎదుర్కోడానికి దీటుగా వ్యూహాన్ని రూపొందించబోతున్నామని తెలిపారు.

గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10,000 మంది ఫ్రెషర్లను చేర్చుకున్నామని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తామని చెప్పారు. త్రైమాసిక ఫలితాల్లో టెక్ మహీంద్రా కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 4 శాతం తగ్గి రూ.1,285 కోట్లకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా ఏకీకృత ఆదాయం రూ. 13,129.5 కోట్లుగా ఉంది.

Tags:    

Similar News